News September 27, 2025

వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి: ఖమ్మం CP

image

ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ సునీల్ దత్ సూచించారు. వర్షాలకు వరద ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో నీట మునిగిన రోడ్లను దాటే ప్రయత్నం చేయవద్దని, యువకులు రిల్, సెల్ఫీల కోసం నీటి ప్రవాహం వద్దకు వెళ్లవద్దని సూచించారు. అత్యవసర సమయాల్లో డయల్‌ 100కు, పోలీస్ కంట్రోల్ సెల్ నెంబర్ 87126 59111, కలెక్టర్ ఆఫీస్ టోల్ ఫ్రీ నె.1077 సమాచారం అందించాలని సూచించారు.

Similar News

News November 5, 2025

చేప పిల్లల పంపిణీ పక్కాగా జరగాలి: ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శ్రీజ

image

ఖమ్మం జిల్లాలో చేప పిల్లల పంపిణీ, విడుదల పక్కాగా జరగాలని ఇన్‌ఛార్జ్ జిల్లా కలెక్టర్ డా. పి. శ్రీజ మత్స్య శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 882 చెరువుల్లో ఉచితంగా చేప పిల్లల పంపిణీ జరుగుతుందన్నారు. నవంబర్ 6 నాటికి మండల, గ్రామ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. కాలుష్యం ఉన్న చెరువుల్లో చేప పిల్లలు వేయవద్దని, వివరాలను టీ-మత్స్య యాప్‌లో నమోదు చేయాలని సూచించారు.

News November 4, 2025

పబ్లిక్ పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించాలి: కలెక్టర్ శ్రీజ

image

రాబోయే పబ్లిక్ పరీక్షల్లో ప్రభుత్వ విద్యా సంస్థల విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని ఇన్‌ఛార్జి కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ సూచించారు. విద్యార్థుల హాజరు శాతంపై దృష్టి సారించాలని, వెనుకబడిన వారికి అదనపు శిక్షణ ఇవ్వాలని తెలిపారు. హాజరు శాతం 90కి పైగా ఉండేలా తల్లిదండ్రులతో నిరంతరం ఫాలోఅప్ చేయాలని ఆదేశించారు.

News November 4, 2025

6న పత్తి కొనుగోలు స్లాట్ బుకింగ్ చేసుకోవద్దు: అ.కలెక్టర్

image

ఈనెల 6న పత్తి కొనుగోలు స్లాట్ బుకింగ్ చేసుకోవద్దని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తెలిపారు. కలెక్టరేట్లో మంగళవారం పత్తి కొనుగోలు పై మార్కెట్ కమిటీ ఛైర్మన్లు, జిన్నింగ్ మిల్ యాజమాన్యం, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ బంద్ పిలుపుమేరకు సీసీ కొనుగోలు కేంద్రాలకు ఆ రోజు పత్తి తీసుకురావద్దని సూచించారు.