News April 6, 2024

ఏలూరు: ఇంటిచుట్టూ తిరుగుతూ మహిళకు వేధింపులు

image

ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలంలోని ఓ మహిళతో అదే గ్రామానికి చెందిన ఆకుల సాయి కొద్దిరోజులుగా అసభ్యకరంగా ప్రవర్తిస్తూ.. ఇంటిచుట్టూ తిరుగుతూ వేధించాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదుచేయగా.. లైంగిక వేధింపులతో పాటు కుల దూషణ కేసు నమోదుచేసినట్లు ఎస్సై దుర్గా మహేశ్వరరావు తెలిపారు.

Similar News

News April 20, 2025

‘డిప్యూటీ సీఎం ఫోటో మార్ఫింగ్ కేసులో వ్యక్తి అరెస్ట్’

image

మార్ఫింగ్ ఫోటోల ద్వారా సోషల్ మీడియాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని కించపరిచే విధంగా వాఖ్యలు చేసిన చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తిని శనివారం భీమవరం పోలీసులు అదుపులో తీసుకున్నారు. పట్టణానికి చెందిన పత్తి హరివర్ధన్ ఫిర్యాదు మేరకు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం సెతేరికి చెందిన చింతలపూడి పవన్ కుమార్‌పై కేసు నమోదు చేశారు. అతనికి 41 నోటీసు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.

News April 20, 2025

ఉండి: గంజాయి విక్రయిస్తున్న 11 మంది అరెస్ట్

image

ఉండి పోలీస్ స్టేషన్‌లో గంజాయి అమ్ముతున్న 11 మందిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు డీఎస్పీ జై సూర్య శనివారం తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ వారంతా జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలని ఆలోచనతో మాదకద్రవ్యాలు అక్రమంగా రవాణా చేస్తున్నారన్నారు. 25 కేసుల్లో నిందితులుగా ఉన్న 11 మందిని అరెస్టు చేసి 16,500 విలువైన 1650 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

News April 20, 2025

ప.గో: ‘శిక్షణ.. సబ్సిడీతో రూ.10లక్షల రుణం’

image

డ్రోన్ కొనుగోలుకు రైతు గ్రూపులకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. శనివారం  కలెక్టరేట్‌లో కలెక్టర్ అధ్యక్షతన వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంకర్లు, డ్రోన్ గ్రూపు సభ్యులు కన్వీనర్, కో కన్వీనర్లతో సమావేశం నిర్వహించారు. డ్రోన్ పైలెట్ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి డ్రోన్ కొనుగోలుకు ప్రభుత్వం సబ్సిడీతో కూడిన రూ.10 లక్షల రుణం అందిస్తామన్నారు.

error: Content is protected !!