News September 27, 2025

BRS ప్రచారాస్త్రంగా ‘కాంగ్రెస్ బాకీ కార్డు’!

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదంటూ BRS వినూత్న ప్రచారానికి తెరతీసింది. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ పేరిట పోస్టర్లు రిలీజ్ చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.

Similar News

News February 10, 2026

భారత్‌తో మ్యాచ్‌కు పాక్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

image

టీ20 వరల్డ్ కప్‌లో ఈ నెల 15న టీమ్ ఇండియాతో మ్యాచ్ ఆడేందుకు పాకిస్థాన్ జట్టుకు ఆ దేశ ప్రభుత్వం అనుమతిచ్చింది. ఐసీసీ, బీసీబీ, పీసీబీ, శ్రీలంకతో జరిగిన చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాక్ ప్రభుత్వం పేర్కొంది. దీంతో ఈ నెల 15న యథావిధిగా మ్యాచ్ జరగనుందని ఐసీసీ పేర్కొంది. భారత్‌తో మ్యాచ్ ఆడాలని <<19097083>>బీసీబీ<<>> రిక్వెస్ట్ చేసిన కాసేపటికే పాక్ ప్రభుత్వం ఈ ట్వీట్ చేయడం గమనార్హం.

News February 10, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (FEB 10, మంగళవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.31 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.45 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.39 గంటలకు
♦︎మఘ్రిబ్: సాయంత్రం 6.16 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.29 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News February 10, 2026

లక్ష మార్కు చేరనున్న సెన్సెక్స్?

image

భారత స్టాక్ మార్కెట్లు ఈ ఏడాది భారీగా పెరగనున్నట్లు ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. డిసెంబర్ నాటికి సెన్సెక్స్ 1,00,000 దాటే అవకాశముందని తెలిపింది. RBI చర్యలు, పన్ను సంస్కరణలు మార్కెట్లకు మద్దతిస్తున్నాయని తెలిపింది. క్రూడాయిల్ ధరలు స్థిరంగా కొనసాగితే ఇది సాధ్యమేనని పేర్కొంది. అయితే చమురు ధరలు పెరిగితే సెన్సెక్స్ 76,000 వరకు పడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.