News April 6, 2024

నల్గొండ: ఫోన్ ట్యాపింగ్ మూలాలు ఇక్కడే!

image

రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన పోలీసుల పాత్ర ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది. జిల్లాకు చెందిన ఓ సీఐని విచారించగా, నల్గొండలో వార్ రూం ఏర్పాటు చేసినట్లు నిర్ధారించారు. అక్కడ తనిఖీలు నిర్వహించారు. ఇప్పటికే ఇద్దరు కానిస్టేబుళ్లను అదుపులో తీసుకున్నారు. విచారణ కొనసాగుతున్న కొద్దీ ఇంకా ఎవరెవరు బయటకొస్తారోనన్న ఉత్కంఠ ఉంది.

Similar News

News January 12, 2026

NLG: సర్కార్ మాటలకే పరిమితం.. కొత్త పథకం ఎక్కడా?

image

రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ మాటలకే పరిమితమైందన్న విమర్శలు వస్తున్నాయి. గత ఎన్నికల ప్రచారంలో భాగంగా చేయూత పథకం కింద కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా అది అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ మొత్తాన్ని పెంచుతామన్న హామీ కూడా ప్రభుత్వం మరిచిపోయిందని వృద్ధులు మండిపడుతున్నారు. జిల్లాలో వేలాదిమంది కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్నారు.

News January 12, 2026

NLG: ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల దందా.. విద్యాశాఖ మౌనమెందుకు?

image

కార్పొరేట్ పాఠశాలలు పబ్లిసిటీ పేరుతో తల్లిదండ్రుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. నల్గొండ, మిర్యాలగూడ, హాలియా, దేవరకొండ సహా పలు కేంద్రాల్లో విద్యార్థుల నుంచి ప్రోగ్రాంల పేరుతో అడ్డగోలుగా వసూళ్లు చేస్తున్నారని ఆరోపణలొస్తున్నాయి. కేవలం వండర్ లా విహారయాత్ర పేరుతో ఒక్కో విద్యార్థి నుంచి రూ. 2500 వరకు గుంజుతున్నట్లు సమాచారం. ఇలాంటి వసూళ్లపై అధికారులు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

News January 12, 2026

NLG: రైతు వేదిక.. నిర్వహణ లేక..

image

జిల్లాలో నిర్మించిన రైతు వేదికల నిర్వహణ భారంగా మారింది. జిల్లాలోని 140 వేదికలకు గాను ఇప్పటివరకు సుమారు రూ.3 కోట్ల వరకు ప్రభుత్వం నుంచి నిధులు రావాల్సి ఉందని ఏఈవోలు తెలిపారు. దీంతో కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ వేదికలు నిరుపయోగంగా మారాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ నిధులు రాకపోవడంతో వేదికల నిర్వహణ విషయంలో వ్యవసాయ శాఖ అధికారులు ఇబ్బందులు పడుతున్నారు.