News April 6, 2024

నేడు తుక్కుగూడ సభ.. పాలమూరు వాహనదారులకు అలర్ట్

image

కాంగ్రెస్‌ పార్టీ శనివారం తుక్కుగూడలో తలపెట్టిన జనజాతర బహిరంగ సభ నేపథ్యంలో.. సభకు వచ్చే వాహనదారులకు, సాధారణ వాహనదారులకు రాచకొండ సీపీ తరుణ్‌జోషి పలు సూచనలు చేశారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు వాహనదారులు నిబంధనలు పాటించాలన్నారు. MBNR నుంచి వచ్చే వాహనాలు ఓఆర్‌ఆర్‌ బెంగుళూరు టోల్‌ నుంచి రావిర్యాల టోల్‌ వద్దనుంచి ఫ్యాబ్‌సిటీ వద్ద పార్కింగ్‌ ప్రాంతానికి చేరుకోవాలని సూచించారు.

Similar News

News October 28, 2025

MBNR: టీఆర్పి పార్టీ మేధావుల నిపుణుల కమిటీ ఛైర్మన్ నియామకం

image

MBNR జిల్లా కేంద్రానికి చెందిన రిటైర్డ్ డీఈవో, డాక్టర్ శివార్చక విజయ్ కుమార్‌ను తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న వీరిని రాష్ట్ర మేధావులు, నిపుణుల సమన్వయ కమిటీ ఛైర్మన్‌గా నియమించారు. వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ బలోపేతం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలను అంకితభావం నిబద్దతతో కలుపుకొని క్షేత్రస్థాయిలో కమిటీలు వేసి పార్టీని బలోపేతం చేయాలన్నారు.

News October 28, 2025

MBNR: మొక్కజొన్న కొనుగోలు కేంద్రం పరిశీలన

image

వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి మంగళవారం సందర్శించారు. మొక్కలు ఎండబెట్టుకుని శుభ్రంగా తీసుకొస్తే ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుందని సూచించారు. పత్తి రైతులతో మాట్లాడుతూ.. స్లాట్ బుకింగ్ చేసుకుని వస్తే సీసీఐ పత్తి కొనుగోలు చేసిందన్నారు. తుపాన్ కారణంగా రేపు ఎల్లుండి వర్షం పడే అవకాశం ఉన్నందున రైతులు జాగ్రత్తగా తీసుకోవాలన్నారు.

News October 28, 2025

కురుమూర్తి ఉద్దాల ఉత్సవంలో జేబుదొంగల చేతివాటం

image

వడ్డేమాన్ ఉద్దాల మండపం వద్ద కురుమూర్తి స్వామి జాతర ఉత్సవాల సందర్భంగా జేబుదొంగలు చేతివాటం ప్రదర్శించారు. లాలకోటకు చెందిన నర్సింహులు జేబులో ఉన్న దాదాపు రూ.10 వేలను దొంగిలించారు. వందలాది పోలీసులు భద్రతలో ఉన్నప్పటికీ, జేబుదొంగలు తమ పనిని కొనసాగించడం విశేషం. కాగా జాతర మైదానంలో ఏటా ఇలాంటి ఘటనలు సర్వ సాధారణంగా మారిపోయాయి. ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.