News April 6, 2024

సెహ్వాగ్‌కి వారసుడయ్యేనా?

image

భారత క్రికెట్ చరిత్రలో మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ది ఓ ప్రత్యేక స్థానం. అతడి రిటైర్మెంట్ తర్వాత.. వీరూ లాంటి డేరింగ్&డ్యాషింగ్ ఓపెనర్‌ను టీమ్ తయారు చేసుకోలేకపోయింది. అయితే SRH బ్యాటర్ అభిషేక్‌శర్మ ఆ లోటు తీర్చేలా కనిపిస్తున్నారు. ఈ యువ కెరటం బ్యాటుతో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. ఈ సీజన్‌లో ఆడిన 4మ్యాచుల్లో 32రన్స్(19బంతుల్లో), 63(23), 29(20), 37(12) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంటున్నారు.

Similar News

News October 9, 2024

జానీ మాస్టర్ అవార్డు రద్దు మంచిదే: కర్ణాటక మంత్రి

image

జానీ మాస్టర్ నేషనల్ అవార్డు రద్దు చేసి కేంద్రం మంచి పనిచేసిందని కర్ణాటక మంత్రి దినేశ్ గుండూరావు సమర్థించారు. రేప్ కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని గౌరవించడం సరికాదన్నారు. ఇదే తరహాలో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న యడియూరప్పపై కూడా కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. యడియూరప్ప విషయంలో కేంద్రం ఎందుకు ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆయన ప్రశ్నించారు.

News October 9, 2024

ఇవి పైసలు కావు.. జ్ఞాపకాలు!

image

పై ఫొటోలో కనిపిస్తున్నవి 5 పైసల నుంచి 20 పైసల వరకూ నాణేలు. ఇప్పుడంటే చలామణీలో లేవు గానీ 90వ దశకంలో పుట్టినవారికి ఇవి మధుర జ్ఞాపకాలు. వీటిని చూస్తే చిన్నతనంలో కొనుక్కున్న పిప్పరమెంట్, పప్పుండ, తాటి-మామిడి తాండ్ర, రేగి ఒడియం, నిమ్మ తొనల చాక్లెట్, బఠాణీలు, గోళీలలాంటివన్నీ గుర్తుకొస్తున్నాయంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మీ చిన్నతనంలో ఈ పైసలుండేవా..? మీ జ్ఞాపకాల్ని కామెంట్స్‌లో పంచుకోండి.

News October 9, 2024

ఒసామా బిన్ లాడెన్ కొడుకుపై ఫ్రాన్స్‌లో నిషేధం

image

ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ కుమారుడు ఒమర్ బిన్ లాడెన్‌ను ఫ్రాన్స్ బహిష్కరించింది. ఓ బ్రిటిష్ పౌరురాల్ని పెళ్లాడి నార్మండీలో సెటిలై చాలాకాలంగా పెయింటింగ్స్ వేస్తూ కాలం గడిపిన ఒమర్, గత ఏడాది సోషల్ మీడియాలో ఉగ్రవాదానికి మద్దతునిస్తూ కామెంట్స్ పెట్టారు. దీంతో అతడిని దేశం నుంచి బయటికి పంపించిన ఫ్రాన్స్ ప్రభుత్వం తిరిగి రాకుండా నిషేధం విధించింది. ఒమర్ ప్రస్తుతం ఖతర్‌లో ఉన్నట్లు సమాచారం.