News April 6, 2024
93.42శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి

AP: రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పంపిణీ 93.42 శాతం పూర్తయింది. 61,37,464 మంది లబ్ధిదారులకు రూ.1874.85 కోట్లను ప్రభుత్వం అందించింది. వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ఇళ్ల వద్దే పింఛన్లు అందించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. నేడు కూడా ఉదయం 7గంటల నుంచి రాత్రి 7గంటల వరకు సచివాలయాల వద్ద పెన్షన్లు అందిస్తామని అన్నారు.
Similar News
News January 24, 2026
షోరూంలోనే రిజిస్ట్రేషన్.. నేటి నుంచే అమల్లోకి

TG: వాహనాల రిజిస్ట్రేషన్ కోసం RTO ఆఫీసుల చుట్టూ తిరిగే తిప్పలు నేటితో ముగియనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘డీలర్ పాయింట్ రిజిస్ట్రేషన్’ విధానం నేటి నుంచి అమల్లోకి వస్తోంది. నిన్న మాదాపూర్‌లో చేసిన ట్రయల్ రన్ సక్సెస్ అయ్యింది. ఇకపై బండి కొన్న షోరూమ్‌లోనే ఫొటోలు, డాక్యుమెంట్లు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసి అక్కడికక్కడే నంబర్ పొందొచ్చు. RC నేరుగా ఇంటికే పోస్టులో వచ్చేస్తుంది.
News January 24, 2026
అధిక పాలిచ్చే పశువుకు ఉండే మరికొన్ని లక్షణాలు

పాడి పశువు నుంచి పాలు పిండిన తర్వాత పొదుగు ఒక రబ్బరు బుడగ గాలి తీసివేస్తే ఎలా అవుతుందో అలా అయిపోవాలి. అలా అవ్వని పొదుగును కండపొదుగు అంటారు. ఇది అధిక పాల దిగుబడికి పనికిరాదు. అంతేకాక పొదుగు మీద కనపడే రక్తనాళాలను గమనించాలి. వీటిని పాల సిరలు అంటారు. ఇవి పెద్దవిగా, ఎక్కువ పొడవుగా ఉండాలి. అలా ఉంటే పొదుగుకు అధిక రక్త సరఫరా జరిగి, పాల దిగుబడి పెరుగుతుంది. పొదుగు మీద చర్మం కూడా పలుచగా ఉండాలి.
News January 24, 2026
రేపు రథ సప్తమి.. ఇలా చేస్తే ఆయురారోగ్యాలు!

రేపు మాఘ శుద్ధ సప్తమి. ఆరోగ్య కారకుడైన సూర్యుడు జన్మించిన రోజు. రేపు సూర్యోదయానికి ముందే నిద్రలేచి అరుణోదయ స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి, సూర్య నమస్కారాలు చేయాలని సూచిస్తున్నారు. ఆదిత్య హృదయం పఠిస్తే ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయని నమ్మకం. అరుణోదయ స్నానం ఎలా చేయాలో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.


