News September 28, 2025

నేడు ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు

image

తెలంగాణలోని 11 జిల్లాల్లో ఇవాళ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ADB, ASF, MNCL, NRML, NZB, KNR, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, MHBD జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కాగా నిన్న మెదక్(D) పాపన్నపేట(M) లింగంపల్లిలో అత్యధికంగా 10.5CM వర్షపాతం నమోదైంది. అటు అల్పపీడనం ప్రభావంతో APలోని పలు ప్రాంతాల్లో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని APSDMA తెలిపింది.

Similar News

News February 13, 2026

బంగ్లాలో BNP.. హిందువుల పరిస్థితేంటి?

image

గత జ్ఞాపకాలు భయపెడుతున్నా ఈసారి BNP వైఖరిలో మార్పు కనిపిస్తోంది. తారిఖ్ ప్రకటించిన మతసామరస్య మ్యానిఫెస్టో, హిందువుల దాడులపై విచారణ జరుపుతామన్న ఆయన హామీ మైనారిటీల్లో ఆశలు రేకెత్తిస్తోంది. భారత్‌తో దౌత్య సంబంధాల పట్ల BNP సానుకూలంగా ఉన్నట్లు <<18723812>>ఖలీదా<<>> మరణ సమయంలో స్పష్టమైంది. ఈ నేపథ్యంలో హిందువుల రక్షణకు ఆ పార్టీ ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. బాధ్యతాయుత ప్రభుత్వంగా అందరినీ కలుపుకొనిపోవడం అసలు సవాల్.

News February 13, 2026

డ్రాగన్ ఫ్రూట్‌తో మహిళలకు ఎన్నో లాభాలు

image

కలర్‌ఫుల్‌గా కనిపించే డ్రాగన్‌ ఫ్రూట్‌‌లో అనేక పోషకాలుంటాయి. ఇవి మహిళల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. మహిళల్లో ఐరన్, ఫోలేట్, విటమిన్ సి లోపాన్ని భర్తీ చేస్తుంది. ముఖ్యంగా మెనోపాజ్‌ సమయంలో ఆస్టియో పోరోసిస్‌ ప్రమాదం ఎక్కువ. డ్రాగన్‌ ఫ్రూట్‌ను రెగ్యులర్‌గా తీసుకుంటే మెగ్నీషియం, క్యాల్షియం అంది ఎముకలు బలంగా తయారవుతాయి. అలాగే శరీరంలో కొల్లాజెన్‌ ఉత్పత్తి పెంచుతుందని చెబుతున్నారు.

News February 13, 2026

7 తరాలు మర్చిపోవు.. బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్

image

బాలీవుడ్ స్టార్స్ రణ్‌వీర్ సింగ్, రోహిత్ శెట్టిలకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మరోసారి వార్నింగ్ ఇచ్చింది. ‘మా లైన్లోకి రాకపోతే (ఇటీవల రూ.10కోట్లు డిమాండ్ చేశారు) జరిగే పరిణామాలు వచ్చే 7 తరాలు మర్చిపోవు’ అని ఆడియో మెసేజ్‌లో రణ్‌వీర్‌ను హెచ్చరించింది. ‘మీ స్టాఫ్, వారి ఫ్యామిలీ మూమెంట్స్ సేకరించాం. వారిపై దాడి చేస్తే మీకు తెలిసి వస్తుందేమో’ అని గ్యాంగ్‌లోని హారీ బాక్సర్ పేరుతో వార్నింగ్ వచ్చింది.