News September 28, 2025
వికసిత్ భారత్ క్విజ్ లో పాల్గొనే ఛాన్స్.. డోంట్ మిస్!

కేంద్ర క్రీడా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే వికసిత్ భారత్ క్విజ్ కార్యక్రమంలో జిల్లాలోని యువతీ యువకులు పాల్గొనాలని స్టెప్ అధికారి శ్రీమన్నారాయణ శనివారం ప్రకటన విడుదల చేశారు. ఈ క్విజ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు 15 నుంచి 29 ఏళ్ల వయసు కలవారు అర్హులన్నారు. ఆసక్తి కలవారు మైభారత్ పోర్టల్ ద్వారా క్విజ్ లో పాల్గొనాలని, పూర్తి వివరాల కోసం mybharat.gov.in వెబ్ సైట్ ను సందర్శించాలని ఆయన కోరారు.
Similar News
News September 28, 2025
గిద్దలూరు: ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగు.. పోలీసుల హెచ్చరిక

గిద్దలూరులోని కొండపేట వాగు వద్ద అర్బన్ స్థానిక పోలీసులు బందోబస్తు చర్యలు ఏర్పాటు చేశారు. వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో నీటి గుండాలు ఏర్పడుతున్నాయని, పిల్లలు ఎవరు ఈతకు వెళ్లరాదని హెచ్చరించారు. ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు.
News September 28, 2025
ప్రకాశం: విద్యుత్ వినియోగదారులకు SE కీలక సూచన

జిల్లాలోని విద్యుత్ వినియోగదారులకు SE వెంకటేశ్వర్లు శనివారం కీలక సూచన చేశారు. ఆదివారం సెలవు దినం అయినప్పటికీ విద్యుత్ బిల్లులు చెల్లించే కౌంటర్లు జిల్లా వ్యాప్తంగా అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. అలాగే 30వ తేదీ కూడా సెలవు దినం అయినప్పటికీ విద్యుత్ బిల్లులను చెల్లించవచ్చని ఆయన విద్యుత్ వినియోగదారులకు సూచించారు. ఈ విషయాన్ని గమనించి విద్యుత్ బిల్లులు చెల్లించాలని ఆయన కోరారు.
News September 27, 2025