News September 28, 2025

స్థానిక ఎన్నికలపై ముందుకే!

image

TG: బీసీలకు 42% రిజర్వేషన్లపై కోర్టులో <<17849599>>కేసు<<>> నడుస్తున్నా స్థానిక ఎన్నికలపై ముందుకే వెళ్లాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై ఇవాళ అడ్వకేట్ జనరల్‌తో CM రేవంత్ చర్చించనున్నారు. న్యాయ నిపుణుల సూచనలకు తగ్గట్లు ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అటు ఇప్పటికే జడ్పీ ఛైర్‌పర్సన్ల <<17853161>>గెజిట్<<>> రాగా ఇవాళ మిగతా స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్ల జాబితాను కలెక్టర్లు ప్రభుత్వానికి అందించనున్నారు.

Similar News

News February 21, 2026

భద్రాద్రి సీతారాముల కళ్యాణ తలంబ్రాలు ఇంటికే!

image

శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి రాములోరి కళ్యాణ తలంబ్రాలను భక్తుల ఇంటికే పంపించేందుకు TGSRTC సిద్ధమైంది. రూ.151 చెల్లించి RTC లాజిస్టిక్ కేంద్రాల్లో లేదా ఆన్‌లైన్‌లో ఈ నెల 23 నుంచి బుక్ చేసుకోవచ్చు. ఈ విషయాన్ని సంస్థ ఎండీ వై. నాగిరెడ్డి ప్రకటించారు. భద్రాద్రికి వెళ్లలేని భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 040-23450033, 040-69440069కు కాల్ చేయండి. share it

News February 21, 2026

రేపు, ఎల్లుండి పలు జిల్లాల్లో వర్షాలు: APSDMA

image

AP: నైరుతి బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రభావంతో రేపు(FEB 22), ఎల్లుండి(FEB 23) పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని APSDMA అంచనా వేసింది. తూ.గో.లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. ప.గో., ఏలూరు, కృష్ణా, NTR, GNT, అన్నమయ్య, CTR, TPT జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. పిడుగుపాటు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

News February 21, 2026

ఇల్లు కట్టుకునే వారికి శుభవార్త

image

TG: బీఆర్ఎస్ హయాంలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన గృహలక్ష్మీ పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెండింగులో ఉన్న బిల్లులను చెల్లించాలని నిర్ణయించింది. అయితే ఇందిరమ్మ ఇళ్ల మార్గదర్శకాల ప్రకారం పునాది ప్రాంతం 400-600sq ft మధ్య ఉండాలి. బేస్‌మెంట్ పూర్తయితే ఆ దశ డబ్బులు చెల్లించరు. పై కప్పు​ లెవల్​ వరకు ₹లక్ష, స్లాబ్​ పూర్తయితే ₹2L, మొత్తం నిర్మాణం పూర్తయితే మరో ₹లక్ష చెల్లించనుంది.