News September 28, 2025
మధ్యాహ్నం 2గంటలకు గ్రూప్-2 ఫలితాలు

TG: గ్రూప్-2 ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలు రిలీజ్ చేయనున్నట్లు TGPSC వర్గాలు తెలిపాయి. 783 పోస్టులకు సంబంధించి నాలుగు విడతల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరిగింది. ఇప్పటికే గ్రూప్-1 ఫలితాలు వెల్లడి కాగా, నిన్న విజేతలకు సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేసిన విషయం తెలిసిందే.
Similar News
News February 13, 2026
విశ్వక్ సేన్ ‘funky’ రివ్యూ&రేటింగ్

దర్శకుడు కావాలనుకున్న ఓ యువకుడు ఏ ఇబ్బందులు పడ్డాడు, ఎలా అధిగమించాడనేదే కథ. డైరెక్టర్ అనుదీప్ సింగిల్ లైనర్స్ కామెడీ ఫస్టాఫ్‌లో కొన్నిచోట్ల ఆకట్టుకుంటుంది. మిగతావి రిపీట్, ఔట్‌డేటెడ్ అన్పిస్తాయి. ఇక కథలో లాజిక్, ఎమోషన్ మిస్ కావడం మైనస్. భీమ్స్ మ్యూజిక్ అంతగా ఆకట్టుకోదు. ఎడిటింగ్ మరో మైనస్. విశ్వక్ సేన్, కయాదు లోహర్ నటన బాగున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు ఫర్వాలేదు.
రేటింగ్: 2/5
News February 13, 2026
మహాశివరాత్రి: ఉపవాసం పరమార్థం ఇదే!

నిజమైన ఉపవాసం అంటే కేవలం ఆహారాన్ని త్యజించడం కాదు. శివునికి సమీపంగా ఉండటం. చెడు ఆలోచనలు, మాటలు, పనులకు దూరంగా ఉంటూ అంతర్ముఖ శుద్ధి సాధించడమే అసలైన శివభక్తి. బాహ్య పూజల కంటే అహంకారాన్ని వీడి, పవిత్రమైన మనసుతో చేసే ఆరాధనే పరమశివునికి ప్రీతికరం. ఉపవాస దీక్ష ద్వారా ఇంద్రియ నిగ్రహాన్ని పొంది, శివతత్వాన్ని ఆకళింపు చేసుకోవడమే ఈ పర్వదినం వెనుక ఉన్న పరమార్థం. మనసుని శివమయం చేయడమే ముక్తికి మార్గం.
News February 13, 2026
దూడల్లో విటమిన్-A లోపం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి?

విటమిన్-A లోపం ఉన్న దూడల్లో మెడ విరుపు, ఎదుగుదల సమస్యలు, విరేచనాలు, కళ్లు ఉబ్బడం, చూపు లేకపోవడం వంటి సమస్యలు కనిపిస్తాయి. పుట్టుకతోనే దూడల్లో ఈ సమస్యలు రాకుండా ఉండటానికి పశువు చూడుతో ఉన్నప్పుడు చివరి 3 నెలలు విటమిన్-A ఇంజెక్షన్ వెటర్నరీ నిపుణుల సూచనలతో అందించాలి. ఈనిన తర్వాత దూడలకు జున్ను పాలు సమృద్ధిగా తాగించాలి. దూడ పుట్టిన తర్వాత 1, 2వ వారం 2ML చొప్పున విటమిన్-A ఇంజెక్షన్ ఇవ్వాలి.


