News September 28, 2025

భీమవరంలో నేటి చికెన్ ధరలు ఇలా

image

భీమవరంలోని పలు ప్రాంతాల్లోని చికెన్, మటన్, రొయ్యలు, చేపల ధరలు ఆదివారం ఈ విధంగా ఉన్నాయి. చికెన్ స్కిన్ లెస్ కిలో రూ.240, లైవ్ రూ.220, మటన్ కిలో రూ.1,000, రొయ్యలు కిలో రూ.300 చొప్పున సైజ్‌ను బట్టి ధరలు, చేపలు కిలో * కిలో రూ.150 వరకు సైజ్‌ను బట్టి ధర పలుకుతున్నాయి. నాటు కోడి కిలో రూ.500వరకు విక్రయిస్తున్నారు. మీ ప్రాంతంలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

Similar News

News September 29, 2025

నేడు యథావిధిగా PGRS: కలెక్టర్ నాగరాణి

image

భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారని వెల్లడించారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె సూచించారు. అలాగే 1100 నంబర్‌కు కాల్ చేసి కూడా తమ సమస్యలు తెలియజేయవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.

News September 27, 2025

ఇంటర్‌లో ఇకపై బయాలజీ పేపర్ మాత్రమే: డిఐఈఓ ప్రభాకర్

image

గతంలో వేర్వేరుగా ఉండే బోటనీ, జువాలజీ సబ్జెక్టులు ఈ ఏడాది నుంచి బయాలజీ పేరుతో ఒకే పేపర్‌ నిర్వహించబడుతుందని జిల్లా ఇంటర్మీడియేట్‌ విద్యా అధికారి జి.ప్రభాకర్‌ తెలిపారు. జిల్లాలోని బోటనీ, జువాలజీ అధ్యాపకులకు తణుకు ఎస్‌ఎన్‌వీటీ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో శనివారం ఓరియంటేషన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సబ్జెక్టులో మార్కులు ఎక్కువ రావడానికి అధ్యాపకులు సమన్వయం చేసుకుని సమష్టి కృషి చేయాలని కోరారు.

News September 27, 2025

కాళ్లలో అత్యధిక వర్షపాతం నమోదు

image

గడచిన 24 గంటల వ్యవధిలో పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా 47 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు శనివారం తెలిపారు. జిల్లాలో అత్యధికంగా కాళ్ల 7.6, పెంటపాడు 4.6, ఇరగవరం 3.6, తణుకు 3.2 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదు కాగా జిల్లాలో పాలకోడేరు, మొగల్తూరు, ఆచంట, యలమంచిలి మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదని వెల్లడించారు.