News September 28, 2025
నెల్లూరు: భూ మార్పిడి ఇకపై స్థానిక సంస్థల్లోనే..

భూ వినియోగ మార్పిడి ఇకపై రెవెన్యూ శాఖ నుంచి జరగదు. ఇందుకు సంబంధించి నాలా చట్టంను ప్రభుత్వం సవరిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. నెల్లూరు జిల్లాలో 2024 నుంచి ఇప్పటివరకు భూ మార్పిడి కోసం 1221 నంబర్లకు సంభందించి దరఖాస్తులు రాగా 568 అనుమతి పొందాయి. కాగా 414 కు డ్రీమ్డ్ అప్రూవల్ పొందగా, 167 తిరస్కరణకు గురయ్యాయి. 77 పలు స్థాయిలో పెండింగ్‌లో ఉన్నాయి. కానీ మారిన విధానంతో ఇకపై ఈ తిప్పలు తప్పనున్నాయి.
Similar News
News September 29, 2025
అర్జీదారులు కాల్ సెంటర్‌ను సంప్రదించవచ్చు: కలెక్టర్

ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS)ను సోమవారం నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణం నందు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలను అధికారిక వెబ్‌సైట్ Meekosam.ap.gov.in ద్వారా నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీ స్థితి, సమాచారం కోసం నేరుగా 1100 కాల్ సెంటర్‌ను సంప్రదించవచ్చని సూచించారు.
News September 28, 2025
నెల్లూరు: రౌడీ షీటర్లు, నేరచరిత్ర కలిగిన వారికి కౌన్సెలింగ్

జిల్లా వ్యాప్తంగా రౌడీషీటర్లకు, నేరచరిత్ర కలిగిన వారికి పోలీసు అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రజా శాంతికి భంగం కలిగిస్తే సహించేది లేదని, ఎవ్వరిని ఉపేక్షించమని, పద్ధతులు మార్చుకోవాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. మహిళలు, బాలికలపై అత్యాచారాలకు, వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. జిల్లాలో నేరాలకు పాల్పడే వారిపై ప్రత్యేక దృష్టి సారించారు.
News September 28, 2025
నెల్లూరు: బంగారం పేరుతో మోసం

జిల్లాలో బంగారం పేరుతో మోసాలు పెరుగుతున్నాయి. తవ్వకాల్లో బంగారం బయటపడిందని, తక్కువ ధరకే ఇస్తామని నమ్మించి ముఠాలు ప్రజలను ఉడాయిస్తున్నాయి. స్టోన్ హౌస్ పేటకు చెందిన వ్యక్తి కర్ణాటకలో బంగారం ఉందని నమ్మి వెళ్లగా, నకిలీ పోలీసుల చేతిలో రూ.60 లక్షలు పోగొట్టుకున్నాడు. జిల్లాలో ఇలాంటి కేసులు తరచూ నమోదవుతున్నాయి. బంగారం ధరలు పెరగడంతో మోసగాళ్లు కొత్త పద్ధతులు అవలంబిస్తూ అమాయకులను దోచుకుంటున్నారు.