News September 28, 2025

OFFICIAL: BCCI అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్

image

బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్ నియమితులయ్యారు. ముంబైలో జరిగిన వార్షిక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. వైస్ ప్రెసిడెంట్‌గా రాజీవ్ శుక్లా, సెక్రటరీగా దేవజిత్ సైకియాను నియమించింది. సెలెక్టర్లుగా మాజీ క్రికెటర్లు ఆర్పీ సింగ్, ప్రజ్ఞాన్ ఓఝాలకు అవకాశం ఇచ్చింది. జమ్మూకశ్మీర్‌కు చెందిన మిథున్ దేశవాళీ క్రికెట్ ఆడారు. IPLలో చెన్నై తరఫున ప్రాతినిథ్యం వహించారు.

Similar News

News February 10, 2026

ఐఐటీ గువాహటిలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

<>ఐఐటీ<<>> గువాహటి 10 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు ఫిబ్రవరి 16 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BTech/MSc/MCA, MBA, PhD, PG, NET, GATE, ME/MTech, CA, BSc/BA, ఇంటర్/డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అర్హులు. ఫిబ్రవరి 20న ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వెబ్‌సైట్: https://www.iitg.ac.in

News February 10, 2026

పెట్టుబడి పరంగా నాకు గోల్డ్ కన్నా బిట్‌కాయిన్లే బెస్ట్: కియోసాకి

image

గోల్డ్, బిట్ కాయిన్‌ పెట్టుబడులకు మంచివేనని, ఒక్క దానినే సెలక్ట్ చేసుకోవాలంటే బిట్ కాయిన్‌కే తన ప్రయారిటీ అని ప్రముఖ ఇన్వెస్టర్ రాబర్ట్ కియోసాకి చెప్పారు. ‘డిమాండ్ పెరిగితే మైన్స్‌ నుంచి బంగారాన్ని ఉత్పత్తి చేయొచ్చు. 21మిలియన్ల తర్వాత బిట్ కాయిన్స్‌ క్రియేట్ చేయలేం. దీర్ఘకాలంలో ధర పెరుగుతుందని నమ్ముతున్నాను. ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితి నుంచి కాపాడే హార్ట్ అసెట్స్‌కే మద్దతిస్తాను’ అని తెలిపారు.

News February 10, 2026

బిడ్డకు పాలిస్తే క్యాన్సర్ నుంచి రక్షణ

image

పాలివ్వడం బిడ్డకే కాదు తల్లికీ రక్షేనంటున్నారు ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. పాలివ్వడం వల్ల మహిళల్లో ఎక్కువగా వచ్చే ట్రిపుల్‌ నెగెటివ్‌ అనే బ్రెస్ట్‌ క్యాన్సర్‌ రాకుండా ఉంటుంది. బిడ్డ పుట్టిన తర్వాత వక్షోజాల్లో ‘సీడీ8+టీ’ అనే వ్యాధినిరోధక కణాలు ఏర్పడతాయి. ఇవి రక్షకభటుల్లా పనిచేస్తూ, వక్షోజాల్లోని క్యాన్సర్‌ కణాలని ఎప్పటికప్పుడు చంపేస్తూ ఉంటాయని పరిశోధనల్లో తేలింది.