News September 28, 2025

తొక్కిసలాటలో 40కి చేరిన మృతుల సంఖ్య

image

కరూర్ తొక్కిసలాటలో మృతుల సంఖ్య 40కి చేరింది. తీవ్రంగా గాయపడ్డ ఓ వ్యక్తి ఇవాళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. నిన్న తమిళనాడులోని TVK పార్టీ చీఫ్ విజయ్ ప్రచార సభలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. తొలుత ముగ్గురే చనిపోయినట్లు వార్తలు రాగా తర్వాత మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగింది. వీరిలో చిన్నారులు, మహిళలే అధికంగా ఉండటం విషాదకరం. అటు మృతుల కుటుంబాలకు PM మోదీ రూ.2లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

Similar News

News February 9, 2026

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News February 9, 2026

గాంధీ జయంతికి వెంకీ ‘ఆదర్శ కుటుంబం’!

image

వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ‘ఆదర్శ కుటుంబం’(AK 47) మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ వేసవిలో రిలీజ్ కానుందని ప్రకటించినా అక్టోబర్ 2(గాంధీ జయంతి)కి విడుదల తేదీ మారే అవకాశాలున్నాయని సినీ వర్గాలు తెలిపాయి. అటు వెంకీ-అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కే మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుందని టాక్. ఇదే జరిగితే మూడున్నర నెలల వ్యవధిలో వెంకీ నటించిన 2 సినిమాలు విడుదల కానున్నాయి.

News February 9, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (FEB 09, సోమవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.32 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.46 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 4.39 గంటలకు ♦︎మఘ్రిబ్: సాయంత్రం 6.15 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7.29 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.