News September 28, 2025

నవంబర్ నుంచి కరెంట్ ఛార్జీలు తగ్గింపు: మంత్రి

image

AP: నవంబర్ నుంచి కరెంట్ ఛార్జీలు తగ్గించనున్నట్లు మంత్రి గొట్టిపాటి రవి వెల్లడించారు. యూనిట్‌కు 13 పైసల చొప్పున తగ్గిస్తామని తెలిపారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో 9 సార్లు ఛార్జీలు పెంచిందని విమర్శించారు. ‘అధిక రేట్లకు విద్యుత్ కొనుగోళ్లను నియంత్రించాం. భవిష్యత్తులో ఛార్జీలను మరింత తగ్గిస్తాం. ప్రజలపై భారం పడకుండా చూస్తాం. ఇప్పటికే రూ.926 కోట్ల ట్రూఅప్ ఛార్జీలు తగ్గించాం’ అని తెలిపారు.

Similar News

News February 12, 2026

హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ 18పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి డిప్లొమా(EE), ITI, టెన్త్, డిగ్రీ అర్హతతో పాటు పని అనుభవం గలవారు FEB 25 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్&రైటింగ్ ఎబిలిటీ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: hindustancopper.com/

News February 12, 2026

114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు గ్రీన్‌సిగ్నల్!

image

ఎయిర్‌ఫోర్స్ బలోపేతమే లక్ష్యంగా భారత్ రూ.3.25 లక్షల కోట్లతో 114 రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ డీల్‌కు రాజ్‌నాథ్ నేతృత్వంలోని డిఫెన్స్ కౌన్సిల్ ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ నెల 17న ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఇండియాకు రానున్నారు. పర్యటనలో భాగంగా ఈ ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని సమాచారం. కాగా ఆపరేషన్ సిందూర్ సమయంలో రఫేల్ సత్తా చాటిన విషయం తెలిసిందే.

News February 12, 2026

కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ వరుస భేటీలు

image

ఢిల్లీ పర్యటనలో CM రేవంత్ పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. మామూనూరు విమానాశ్రయానికి భూ సేకరణ పూర్తయినందున అవసరమైన పనులు చేపట్టాలని రామ్మోహన్ నాయుడును కోరారు. కొత్తగూడెం, అంతర్గాం, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌లకు సంబంధించి చర్చలు జరిపారు. అశ్వినీ వైష్ణవ్, రాజ్‌నాథ్‌ సింగ్‌తోనూ CM సమావేశమయ్యారు. ఈనెల చివరి వారంలో జరిగే గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపనకు హాజరు కావాలని రాజ్‌నాథ్‌ను ఆహ్వానించారు.