News September 28, 2025
విజయవాడ: అమ్మవారి గుడి వైపు బైక్‌లకు నో ఎంట్రీ

సోమవారం మూలా నక్షత్రం సందర్భంగా 29వ తేదీ రాత్రి 7.30 నుంచి 30న ఉదయం 10 వరకు ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు సీపీ రాజశేఖరబాబు తెలిపారు. కుమ్మరిపాలెం, తాడేపల్లి చెక్‌పోస్ట్, గద్ద బొమ్మ సెంటర్ నుంచి బైక్‌లు, వాహనాలు అమ్మవారి గుడివైపు అనుమతించమన్నారు. నగరంలోకి ప్రవేశించే వాహనాలు పోలీసుల సూచనల మేరకు వారధి, వెస్ట్ బైపాస్, కనకదుర్గ ఫ్లైఓవర్, చిట్టినగర్ సొరంగం, BRTS రోడ్డు, CVR ఫ్లైఓవర్ మీదుగా వెళ్లాలన్నారు
Similar News
News September 28, 2025
మహానటి సావిత్రి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు: జయసుధ

మహానటి సావిత్రి ఏ పాత్రలోనైనా అద్భుతంగా నటించి ప్రేక్షకుల ఆదరణ పొందారని సినీ నటి జయసుధ అన్నారు. ఆదివారం గుంటూరు వచ్చిన సందర్భంగా కళా దర్బార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సావిత్రి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. సావిత్రి నటన విశిష్టమైందని, ఆమె స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేరని పేర్కొన్నారు. సావిత్రి విగ్రహం ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు.
News September 28, 2025
గుంటూరు జిల్లా వాసులకు కలెక్టర్ సూచన

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సమర్పించిన అర్జీల స్థాయిని 1100 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. Meekosam.ap.gov.in వెబ్సైట్ లోనూ నమోదు చేసుకోవచ్చన్నారు. సోమవారం జిల్లా కేంద్రంతో పాటూ మండల కార్యాలయాల్లో ప్రజా సమస్యలు స్వీకరించడం జరుగుతుందన్నారు. ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
News September 28, 2025
తెనాలిలో వింత…! స్మశాన వాటికలో డమ్మీ సమాధిపై ఫిర్యాదు

తెనాలి ఐతానగర్ స్మశాన వాటికలో ఎటువంటి మృతదేహం లేకుండా కొన్నేళ్లుగా డమ్మీ సమాధి నిర్మించారని ఇదే ప్రాంతానికి చెందిన గడ్డేటి ప్రకాష్ బాబు టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆదివారం సీఐ రాములు నాయక్ ను కలిసి 2015లో డమ్మీ సమాధిని నిర్మించినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని రాతపూర్వక ఫిర్యాదును అందజేశారు. సమాధిని ముందుగానే నిర్మించి స్థలాన్ని కబ్జా చేశారంటూ ఫిర్యాదు చేయడం సర్వత్రా చర్చనీయాంసమైంది.