News September 29, 2025
రాజమండ్రి ‘టెంపుల్ స్ట్రీట్’గా గౌతమి ఘాట్

రాజమండ్రిలోని గౌతమి ఘాట్ వద్ద, గోదావరి నది తీరంలో ప్రసిద్ధ ఆలయాలు కొలువై ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతాన్ని ‘టెంపుల్ స్ట్రీట్’గా పిలుస్తారు. ఇక్కడ ప్రసిద్ధి చెందిన ఇస్కాన్ టెంపుల్, గాయత్రి పీఠం, దత్త పీఠం వ్యాసాశ్రమం, శ్రీ రంగనాథ ధామం, అయ్యప్ప, సరస్వతి ఆలయాలతో పాటు మహాకాళేశ్వర ఆలయం కూడా ఉంది. ఈ మహాకాళేశ్వర స్వామికి నిత్యం చిత భస్మంతో అభిషేకం చేస్తారు. ఈ ప్రాంగణంలో అనేక ఉప ఆలయాలు కూడా ఉన్నాయి.
Similar News
News September 29, 2025
అఖండ గోదావరికి అయిదు వంతెనల హారం

రాజమండ్రి- కొవ్వూరును కలుపుతూ గోదావరి నదిపై నిర్మించిన ఐదు వంతెనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 1975లో నిర్మించిన ఆసియాలోనే రెండో అతిపెద్దదైన రోడ్డు కమ్ రైల్వే వంతెన, బ్రిటిష్ హయాంలోని హేవలాక్ బ్రిడ్జి గోదావరికి మణిహారాలుగా ఉన్నాయి. ఆర్చ్ ఆకారపు రైలు వంతెన, 2015లో నిర్మించిన 4 లైన్ల రోడ్డు వంతెన, ధవళేశ్వరం ఆనకట్ట ఈ ఐదు అద్భుతాలు గోదావరి అందాలను ఇనుమడింపజేస్తున్నాయి.
News September 29, 2025
రాజమహేంద్రవరంలో కందుకూరి స్మృతులు

రాజారాజా నరేంద్రుడు పాలించిన రాజమహేంద్రవరంలోని కందుకూరి వీరేశలింగం పంతులు 1848 ఏప్రిల్ 16న జన్మించారు. ఇక్కడి నుంచే ఆయన ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. సతీసహగమనంపై పోరాటం చేసి భార్య రాజ్యలక్ష్మితో కలిసి వితంతుకు తొలి పునర్వివాహం ఇక్కడే చేశారు. సమాజంలో దురాచారాలపై ఆయన ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ప్రయత్నించారు. ఇప్పటికీ ఆయన ధరించిన కోటు, కుర్చీ, లాంతరు ఇప్పటికీ ఇక్కడ భద్రంగా ఉన్నాయి.
News September 29, 2025
రాజమండ్రి: నేడు పీజీఆర్‌ఎస్ కార్యక్రమం

రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం పీజీఆర్‌ఎస్ కార్యక్రమం యథావిధిగా నిర్వహించనున్నట్లు తూ.గో కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. డివిజన్, మండల స్థాయిల్లో కూడా ఈ కార్యక్రమం ఉంటుందని ఆమె వెల్లడించారు. ప్రజలు తమ సమస్యలు, అభ్యర్థనలను meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అలాగే నమోదు చేసిన అర్జీల స్థితి, సంబంధిత వివరాల కోసం 1100 నంబరుకు కాల్ చేయవచ్చని కలెక్టర్ సూచించారు.