News September 29, 2025
విశాఖలో మూడు బైకులు దగ్ధం

జాలరిపేటలో తెల్లవారుజామున మూడు బైకులు పూర్తిగా కాలిపోయాయి. మరో బైకు సగం కాలిపోయి ఉన్నాయని బాధితులు ఎంవిపి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్సై ధనుంజయ్ ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. ఎవరైనా కావాలానే కాల్చేశారా.. లేక షార్ట్‌సర్క్యూట్ కారణమా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Similar News
News September 29, 2025
విశాఖ సీపీ కార్యాలయానికి 80 ఫిర్యాదులు

విశాఖ పోలీస్ కమిషనరేట్‌లో సోమవారం జరిగిన గ్రీవెన్స్ డేకు 80 ఫిర్యాదులు వచ్చాయని కమిషనర్ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. ఫిర్యాదుదారులతో నేరుగా ఆయన మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి చట్టపరంగా సమస్య పరిష్కారించాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్‌లో ఒకసారి నమోదైన ఫిర్యాదు పునరావృతం కాకుండా చూడాలన్నారు.
News September 29, 2025
జీవీఎంసీ గ్రీవెన్స్ డేకు 112 వినతులు

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేకు 112 వినతులు వచ్చాయి. జీవీఎంసీ అదనపు కమిషనర్ డీవీ రమణమూర్తి ప్రజల సమస్యలు తెలుసుకుని అర్జీలు స్వీకరించారు. అకౌంట్సు విభాగానికి 6, రెవెన్యూ 8, ప్రజారోగ్యం 5, పట్టణ ప్రణాళిక 59, ఇంజినీరింగు 18, మొక్కల విభాగానికి 7, యూసీడీకి 9 కలిపి మొత్తంగా 112 ఫిర్యాదులు వచ్చాయన్నారు. నిర్ణీత సమయంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
News September 29, 2025
విశాఖ కలెక్టర్ గ్రీవెన్స్ డేకు 365 వినతులు

గ్రీవెన్స్ డేలో వచ్చిన అర్జీలకు సకాలంలో పరిష్కారం చూపాలని విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం ఆయన వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 365 అర్జీలు అందాయి. రెవెన్యూ విభాగానికి చెందినవి 121, జీవీఎంసీ 124, పోలీస్ శాఖవి 26 ఉండగా, 94 ఇతర అంశాలకు సంబంధించినవి. ఫిర్యాదుదారులతో ఫోన్‌లో మాట్లాడి పరిష్కారం చూపాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.