News September 29, 2025

విశాఖ: కాలుతో పరీక్ష రాసి టీచర్ అయ్యాడు..!

image

అవును మీరు చదివింది నిజమే. కొత్త‌వ‌లస మండలం గ‌నిశెట్టిపాలేనికి చెందిన జామి సింహాచ‌లం నాయుడికి పుట్ట‌క‌తోనే అంగ‌వైక‌ల్యం. విశాఖలో కష్టపడి చదివారు. మెగా డీఎస్సీలో ఎడ‌మ కాలుతో ప‌రీక్ష రాసి టీచర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. రాష్ట్రస్థాయిలో 320వ ర్యాంకు, దివ్యాంగుల కేటగిరీలో 4వ ర్యాంకు సాధించాడు. దీంతో ఆయనను విశాఖ క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ సోమవారం తన కార్యాలయంలో అభినందించారు.

Similar News

News September 29, 2025

విశాఖ సీపీ కార్యాలయానికి 80 ఫిర్యాదులు

image

విశాఖ పోలీస్ కమిషనరేట్‌లో సోమవారం జరిగిన గ్రీవెన్స్ డేకు 80 ఫిర్యాదులు వచ్చాయని కమిషనర్ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. ఫిర్యాదుదారులతో నేరుగా ఆయన మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్‌, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి చట్టపరంగా సమస్య పరిష్కారించాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్‌లో ఒకసారి నమోదైన ఫిర్యాదు పునరావృతం కాకుండా చూడాలన్నారు.

News September 29, 2025

జీవీఎంసీ గ్రీవెన్స్ డేకు 112 వినతులు

image

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేకు 112 వినతులు వచ్చాయి. జీవీఎంసీ అదనపు కమిషనర్ డీవీ రమణమూర్తి ప్రజల సమస్యలు తెలుసుకుని అర్జీలు స్వీకరించారు. అకౌంట్సు విభాగానికి 6, రెవెన్యూ 8, ప్రజారోగ్యం 5, పట్టణ ప్రణాళిక 59, ఇంజినీరింగు 18, మొక్కల విభాగానికి 7, యూసీడీకి 9 కలిపి మొత్తంగా 112 ఫిర్యాదులు వచ్చాయన్నారు. నిర్ణీత సమయంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

News September 29, 2025

విశాఖ కలెక్టర్ గ్రీవెన్స్ డేకు 365 వినతులు

image

గ్రీవెన్స్ డేలో వచ్చిన అర్జీలకు సకాలంలో పరిష్కారం చూపాలని విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం ఆయన వినతులు స్వీకరించారు. వివిధ స‌మ‌స్య‌ల‌పై మొత్తం 365 అర్జీలు అందాయి. రెవెన్యూ విభాగానికి చెందిన‌వి 121, జీవీఎంసీ 124, పోలీస్ శాఖ‌వి 26 ఉండ‌గా, 94 ఇత‌ర అంశాల‌కు సంబంధించినవి. ఫిర్యాదుదారుల‌తో ఫోన్‌లో మాట్లాడి పరిష్కారం చూపాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.