News April 6, 2024

పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా !

image

తుక్కుగూడ జన జాతర సభలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చే 23 ప్రత్యేక హామీలను కాంగ్రెస్‌ సిద్ధం చేసింది. కేంద్రంలో అధికారంలోకి వస్తే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా కల్పిస్తామని హామీ ఇవ్వనుంది. విభజన చట్టంలో ఉన్నప్పటికీ మోదీ ప్రభుత్వం ఉపసంహరించుకున్న ఐటీఐఆర్‌ను ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేయనుంది. ఈ మేరకు నేడు ప్రత్యేక హామీలను రాహుల్‌ గాంధీ ఆధ్వర్యంలో రేవంత్‌రెడ్డి సభ వేదికపై ప్రకటించనున్నారు.

Similar News

News April 21, 2025

MBNR: అడ్డాకులలో అత్యధిక వర్షపాతం నమోదు

image

మహబూబ్‌నగర్ జిల్లాలో గత 24 గంటల్లో వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. అడ్డాకుల 20.5 మిల్లీమీటర్లు, మిడ్జిల్ మండలం దోనూరు 14.3 మిల్లీమీటర్లు, మూసాపేట మండలం జానంపేట 6.0 మిల్లీమీటర్లు, కౌకుంట్ల 3.8 మిల్లీమీటరు బాలానగర్ మండలం ఉడిత్యాల 1.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అకాల వర్షాలతో వరి కోతలకు పొలం తడి ఆరడం లేదన్నారు.

News April 21, 2025

MBNR: కోయిలకొండలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

image

మహబూబ్‌నగర్ జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కోయిలకొండలో 43.3 డిగ్రీలు, నవాబుపేట 43.2, అడ్డాకుల 42.5, మహమ్మదాబాద్ 42.4, దేవరకద్ర 41.8, చిన్నచింతకుంట మండలం నంది వడ్డేమాన్ 41.6, కౌకుంట్ల 41.3, కోయిలకొండ మండలం పారుపల్లి 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

News April 21, 2025

MBNR: 9,970 GOVT జాబ్స్.. లైబ్రరీలకు నిరుద్యోగుల క్యూ

image

సికింద్రాబాద్ సహా పలు రైల్వే రీజియన్లలో 9,970అసిస్టెంట్ లోకో పైలెట్ పోస్టుల నోటిఫికేషన్ రావడంతో MBNR,NRPT,GDWL,WNP,NGKLలోని లైబ్రరీలకు నిరుద్యోగులు క్యూ కడుతున్నారు. సిలబస్ బుక్స్‌తో కసరత్తు చేస్తున్నారు. కొందరేమో HYDకు వెళ్లి కోచింగ్ సెంటర్లలో ప్రిపేర్ అవుతున్నారు. ఆన్‌లైన్ అప్లికేషన్‌కు మే 11 చివరి తేదీ. వెబ్‌సైట్: https://indianrailways.gov.in/railwayboard/view_section.jsp?lang=0&id=0,7,1281

error: Content is protected !!