News September 30, 2025

కొత్తూరు: పిడుగు పడి వ్యక్తి మృతి

image

కొత్తూరు మండలం సిరుసువాడ గ్రామంలో సోమవారం సాయంత్రం పిడుగు పడి వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన కోటిలింగాల హరిశ్చంద్రుడు (50) సోమవారం సాయంత్రం వర్షం పడుతున్న సమయంలో తన ఇంటి పెరటిలోకి వెళ్ళాడు. అదే సమయంలో అతనిపై పిడుగు పడింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. హరిశ్చంద్రుడు మృతితో గ్రామంలో విషాదం ఆలముకుంది.

Similar News

News October 1, 2025

టెక్కలి: ‘ప్రయాణీకుల సౌకర్యానికి ప్రాధాన్యత’

image

ప్రయాణీకుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ కాంప్లెక్స్‌లలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోనున్నట్లు ఆర్టీసీ ఈడీ బ్రహ్మానంద రెడ్డి అన్నారు. మంగళవారం టెక్కలి ఆర్టీసీ డిపో, కాంప్లెక్స్‌ను అధికారులతో కలిసి పరిశీలించారు. బీవోటీ పద్దతిలో ఆర్టీసీ కాంప్లెక్స్‌ల ఆధునీకరణకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అనంతరం డిపోను పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. డిపో మేనేజర్ శ్రీనివాసరావు ఉన్నారు.

News September 30, 2025

పిట్టవానిపేట సముద్ర తీరంలో గుర్తు తెలియని మృతదేహం

image

సంతబొమ్మాళి మండలం పిట్టవానిపేట గ్రామ సముద్ర రేవులో గుర్తుతెలియని మృతదేహం మంగళవారం కలకలం రేపింది. స్థానిక మత్స్యకారులు సముద్ర తీరంలో ఈ మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహం ఉబ్బి ఉండడంతో కొద్ది రోజులు క్రితం మృతి చెంది ఉండవచ్చునని మత్స్యకారులు తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమచారం మేరకు సంతబొమ్మాళి ఎస్ఐ సింహాచలం ఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు.

News September 30, 2025

కోటబొమ్మాళి: అర్హత కలిగిన ప్రతి పేదవానికి కాలనీ ఇల్లు

image

అర్హత కలిగిన ప్రతి పేదవానికి కాలనీ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కోటబొమ్మాలి మండలం నిమ్మాడలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కోటబొమ్మాళి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన 26 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. పేదల సొంత ఇంటి కల నెరవేర్చడమే చంద్రబాబు ధ్యేయం అన్నారు. పేదల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అచ్చన్న స్పష్టం చేశారు.