News September 30, 2025
విశాఖలో కీచక తండ్రికి మరణశాసనం

ముక్కుపచ్చలారని ఐదేళ్ల కూతురిపై మద్యం మత్తులో కన్న తండ్రే లైంగిక దాడి చేశారు. నిందితుడికి మరణం వరకూ కఠిన కారాగారా జీవిత ఖైదు, రూ.10వేల జరిమానా విధించాలని విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ప్రభత్వం బాధితురాలికి రూ.5లక్షల నష్ట పరిహారంగా ఇవ్వాలని ఆదేశించింది.15/04/25న భీమిలి పోలీసు స్టేషన్ పరిధిలో రాయితి అప్పన్నపై కేసు నమోదవ్వగా కోర్టు పై విధంగా తీర్పునిచ్చింది.
Similar News
News September 30, 2025
బురుజుపేట: గజలక్ష్మి అవతారంలో కనకమహాలక్ష్మి

బురుజుపేట కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం అమ్మవారు గజలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకుడు వేకువజాము నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి గాజులతో సుందరంగా అలంకరించారు. అనంతరం సహస్రనామార్చన చేపట్టారు. ఈవో శోభారాణి భక్తులకి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
News September 30, 2025
అధికారులపై విశాఖ మేయర్ ఆగ్రహం..!

నగర మేయర్ పీలా శ్రీనివాసరావు స్థాయి సంఘ సమావేశంలో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా రూ.50 కోట్లకు పైగా రోడ్ల పునరుద్ధరణ, కొత్త నిర్మాణాలు, లైటింగ్ వంటి 91 ప్రతిపాదనలు అజెండాలో పొందుపరిచారు. అయితే ఇటీవలే రోడ్లకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసినట్లు గుర్తుచేసి మళ్లీ అదే పనులకు నిధులు ఎందుకు ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించారు. పలువురు బీజేపీ నేతలు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు.
News September 30, 2025
గూగుల్ డేటా సెంటర్.. నష్ట పరిహారం పెంపు: గంటా

ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ కోసం కేటాయించిన భూముల పరిహారం పెంచుతున్నట్లు ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ తెలిపారు. సోమవారం ఆర్డీవో సంగీత్ మాధుర్‌తో కలిసి రైతులతో ఆయన సమావేశమయ్యారు. ఎకరాకు ఉన్న రూ.17 లక్షలకు అదనంగా రూ.2.55 లక్షలు పెంచుతున్నట్లు వెల్లడించారు. భూములు ఇచ్చిన రైతులకు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లో స్థలం, అలాగే 3 సెంట్ల ఇళ్ల స్థలం అందజేస్తామని పేర్కొన్నారు.