News September 30, 2025
మళ్లీ పాక్‌తో తలపడనున్న భారత్

మెన్స్ ఆసియాకప్‌లో పాక్‌ను భారత్ మూడుసార్లు చిత్తుచేసిన విషయం తెలిసిందే. ఇక మహిళల జట్టు వంతు వచ్చింది. ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్‌లో నేడు SLను ఢీకొట్టనున్న భారత్, OCT 5న కొలంబోలో PAKతో తలపడనుంది. అలాగే విశాఖలో 9న SAతో, 12న AUSతో ఆడనుంది. ఇండోర్‌లో 19న ENGతో, నవీముంబైలో 23న NZతో, 26న BANను ఢీకొంటుంది. ఇక 29, 30 తేదీల్లో సెమీఫైనల్స్, NOV 2 ఫైనల్ జరగనున్నాయి. ఈ మ్యాచ్‌ల వేదికలు ఇంకా ఖరారు కాలేదు.
Similar News
News February 4, 2026
అమెరికా యుద్ధనౌకపై ఇరాన్ డ్రోన్ దాడికి యత్నం

ఒకవైపు చర్చలకు సానుకూలంగా ఉన్నామని చెబుతూనే, తమ యుద్ధనౌకపైకి డ్రోన్ దాడి చేసేందుకు ఇరాన్ సిద్ధపడిందని అమెరికా ఆరోపించింది. అరేబియా సముద్రంలో ఉన్న ‘అబ్రహం లింకన్’ విమాన వాహక నౌకపైకి.. ఇరాన్‌కు చెందిన ‘షాహెద్ 139’ డ్రోన్ దూసుకొచ్చిందని, దాన్ని F-35 యుద్ధవిమానంతో కూల్చివేశామని అమెరికా అధికారులు తెలిపారు. ఈ వారం చివరిలో USA-ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరుగుతాయని వార్తలు వెలువడ్డాయి.
News February 4, 2026
వరిలో రెల్లరాల్చు పురుగును ఎలా నివారించాలి?

వరి పంటను రెల్లరాల్చు పురుగు ఆశించి నష్టం కలిగిస్తుంది. ఈ పురుగు లార్వాలు గింజ గట్టిపడే దశలో కంకులను కత్తిరిస్తాయి. దీని వల్ల కంకులు రాలిపోతాయి. ఈ పురుగులు పగలు భూమిలో దాక్కొని రాత్రి వేళల్లో పంటలకు తీవ్ర నష్టం కలిగిస్తాయి. ఈ పురుగుల ఉద్ధృతి తక్కువగా ఉంటే లీటరు నీటికి క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ.. ఉద్ధృతి ఎక్కువగా ఉంటే లీటరు నీటికి క్లోరంట్రనిలిప్రోల్ 0.3ml కలిపి సాయంత్రం వేళ పిచికారీ చేయాలి.
News February 4, 2026
BELలో 99 పోస్టులు.. అప్లై చేశారా?

చెన్నైలోని BEL 99 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. BE/BTech, BCom, BBA, BBM, డిప్లొమా, ITI అర్హత గలవారు ముందుగా NATS/NAPS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ITI, డిప్లొమా, డిగ్రీ అభ్యర్థులకు FEB 5న, BE/BTech అభ్యర్థులకు FEB 6, 7తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. అప్రెంటిస్‌గా ఏడాది పూర్తి చేసుకున్నవారికి పరీక్ష నిర్వహించి ట్రైనీ Engg., అడ్వాన్స్‌డ్ ట్రైనీస్‌గా నియమించుకుంటారు.


