News September 30, 2025
41 మంది మృతి.. పరామర్శ లేదు, వివరణ లేదు!

కరూర్ తొక్కిసలాట ఘటనతో TVK చీఫ్ విజయ్ ఇంకా రాజకీయ పరిణతి సాధించనట్లు స్పష్టమవుతోంది. దుర్ఘటనలో 41 మంది చనిపోయినా, 50 మందికి పైగా గాయపడ్డా బాధిత కుటుంబసభ్యులను ఇప్పటివరకు పరామర్శించలేదు. కనీసం ప్రెస్ మీట్ కూడా నిర్వహించలేదు. ‘ఆ ఘటనతో నా గుండె పగిలింది’ అని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ మాత్రమే చేశారు. మరోవైపు విజయ్ పరిహారం ప్రకటించారని, ప్రస్తుతం ఆయన షాక్‌లో ఉన్నారని సన్నిహితులు చెబుతున్నారు.
Similar News
News January 26, 2026
ఇండోర్‌లో కలుషిత నీరు.. 28కి చేరిన మరణాలు

MPలోని ఇండోర్‌లో కలుషిత నీరు తాగి మరణించిన వారి సంఖ్య 28కి చేరింది. భగీరథ్‌పురలో 10 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మోవ్‌లో 30 మంది అస్వస్థతకు గురయ్యారు. అటు ప్రభుత్వం 21 మంది మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం చెల్లించింది. కాగా బాధితులకు అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నట్లు ఇండోర్ కలెక్టర్ శివమ్ వర్మ తెలిపారు.
News January 26, 2026
312 పోస్టులు.. అప్లైకి మూడు రోజులే ఛాన్స్

RRB ఐసోలేటెడ్ కేటగిరీలో 312 పోస్టులకు అప్లై చేయడానికి 3 రోజులే ( JAN 29) సమయం ఉంది. పోస్టును బట్టి ఇంటర్, డిగ్రీ, LLB, MBA, డిప్లొమా, PG(హిందీ, ఇంగ్లిష్, సైకాలజీ) అర్హతతో పాటు పని అనుభవం గలవారు అర్హులు. CBT(1, 2), స్కిల్ టెస్ట్, DV, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.19,900-రూ.44,900 వరకు చెల్లిస్తారు. సైట్: www.rrbcdg.gov.in/ * మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News January 26, 2026
RITESలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<


