News September 30, 2025

అకాడమీలు లేక క్రీడలు వెలవెల

image

క్రీడల్లో రాణించాలంటే శిక్షణ అవసరం. అందుకు అకాడమీలు ఉండాలి. అయితే జిల్లాకు ప్రధాన స్పోర్ట్స్ కాంప్లెక్స్ అకాడమీలు లేక వెలవెలబోతోంది. బ్యాడ్మింటన్, ఫుట్ బాల్, అథ్లెటిక్స్, ఖోఖో, హ్యాండ్ బాల్, వాలీబాల్ క్రీడలకు అకాడమీలు ఉండేవి. ఇవి కాస్త ప్రస్తుతం మూత పడ్డాయి. వీటిని అందుబాటులోకి తీసుకొస్తే క్రీడాకారులకు ప్రయోజనంగా ఉంటాయి. ఈ ప్రభుత్వంలోనైనా వాటిని మంజూరు చేస్తారేమో చూడాలి.

Similar News

News September 30, 2025

నెల్లూరు: కట్టారు.. వదిలేశారు..!

image

జిల్లా ఔషద నియంత్రణ శాఖ AD కార్యాలయాన్ని రూ. కోట్లు వెచ్చించి నెల్లూరు పెద్దాసుపత్రి ఆవరణంలో దాదాపు 6 నెలల క్రితం నిర్మించారు. అయితే అధికారులు ఆ భవనాన్ని ప్రారంభించకపోవడంతో చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. ఎన్నో ఏళ్ల నుంచి జేమ్స్ గార్డెన్‌లో అద్దె భవనంలో ఉంటున్న కార్యాలయాన్ని సొంత భవనంలోకి తరలిస్తే పరిపాలపరంగా సులువుగా ఉంటుంది. అధికారులు స్పందించి కార్యాలయం వినియోగంలోకి తీసుకురావాల్సి ఉంది.

News September 30, 2025

నెల్లూరు జిల్లాలో -20.7 లోటు వర్షపాతం

image

నెల్లూరు జిల్లాలో గత 4 నెలల్లో 320.4 MM సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 254.2 MM వర్షపాతం నమోదై -20.7 MM లోటు వర్షపాతం నెలకొంది. జిల్లాలోని 22 మండలాల్లో లోటు వర్షపాతం, 13 మండలాల్లో సాధారణం, కోవూరు, విడవలూరు, వెంకటాచలం మండలాల్లో మాత్రమే ఎక్కువ వర్షపాతం నమోదైంది. కాగా జిల్లా వ్యాప్తంగా ఈఏడాదిలో ఇప్పటివరకు 1052.9 MM వర్షపాతం కురవాల్సి ఉండగా.. 1170.3 MM నమోదై వర్షభావం నుంచి బయట పడినట్టయింది.

News September 30, 2025

‘సూపర్‌ GST.. సూపర్‌ సేవింగ్స్‌’ పోస్టర్ల ఆవిష్కరణ

image

GST 2.0 ఫలాలు ప్రజలందరికీ అందించాలని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా అన్నారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్లో ‘సూపర్‌ GST.. సూపర్‌ సేవింగ్స్‌’పై అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. GST తగ్గింపు వలన 90 శాతం వస్తువులు ధరలు తగ్గి ప్రజలకు అందుబాటులోకి వచ్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కమిషనర్‌ కిరణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.