News September 30, 2025
ఈవీలకు శబ్ద పరికరాలు అమర్చండి: కేంద్రం

ప్రయాణ సమయంలో ఎలక్ట్రిక్ కార్లు, బస్సులు, లారీల నుంచి శబ్దం వినిపించేలా పరికరాలను అమర్చాలని కేంద్రం ఆదేశించింది. పాదచారులు, ఇతర వాహనదారులు గుర్తించేందుకు అకౌస్టిక్ వెహికల్ అలర్టింగ్ సిస్టమ్(AVAS) అమర్చాలని పేర్కొంది. 2026 అక్టోబర్ 1 నుంచి తయారయ్యే EVలకు తప్పనిసరి చేసింది. ప్రస్తుత వాహనాలకూ AVASలను అమర్చుకోవాలని తెలిపింది. శబ్దం రాకపోవడంతో జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
Similar News
News February 10, 2026
FLASH: స్వల్పంగా పెరిగిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఉదయం నుంచి స్థిరంగా ఉన్న బంగారం ధర సాయంకాలానికి కాస్త పెరిగింది. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.870 పెరిగి రూ.1,58,780కు చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.800 ఎగబాకి రూ.1,45,550 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.3లక్షలుగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.
News February 10, 2026
చామంతి పువ్వుల పరిమాణం పెరగాలంటే..

చామంతి సాగులో కొన్ని సార్లు పువ్వుల పరిమాణం మరీ తక్కువగా ఉంటుంది. దీని వల్ల రైతులకు ఆశించిన ధర రాదు. చామంతి పువ్వుల పరిమాణం పెరగాలంటే.. మొక్కల తలల కత్తిరింపు చేపట్టిన తర్వాత 20 నుంచి 25 రోజులకు లీటరు నీటిలో 50 ppm జిబ్బరెల్లిక్ ఆమ్లం (50 మిల్లీ గ్రాములను) కలిపి పిచికారీ చేయాలని హార్టికల్చర్ నిపుణులు సూచిస్తున్నారు.
News February 10, 2026
మరోసారి తెరపైకి మైసూర్ సోప్, తమన్నా వివాదం

మైసూర్ శాండల్ సోప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా తమన్నాను నియమించడంపై విమర్శలు వస్తున్నాయి. KN ప్రభుత్వ అధీనంలోని కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ తయారు చేసే సబ్బుకు ముంబైలో పుట్టిన తమన్నాను రూ.6.2 కోట్ల కాంట్రాక్ట్‌కు నియమించడం కాంగ్రెస్ నాయకుల యాంటీ కన్నడ మైండ్‌సెట్‌కు నిదర్శనమని బీజేపీ ఎంపీ కె.సుధాకర్ ఆరోపించారు. 2025, మేలో ఓకే అయిన ఈ కాంట్రాక్ట్ నేటి నుంచి అమలులోకి వచ్చింది.


