News April 6, 2024

అసెంబ్లీ సమన్వయకర్తలను నియమించిన BRS

image

TG: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అసెంబ్లీ స్థానాల వారీగా సమన్వయకర్తలను నియమించింది. మేడ్చల్-శంబీపూర్ రాజు, మల్కాజిగిరి-నందికంటి శ్రీధర్, కుత్బుల్లాపూర్-గొట్టిముక్కల వెంగళరావు, కూకట్‌పల్లి-బేతిరెడ్డి సుభాశ్ రెడ్డి, ఉప్పల్-జహంగీర్ పాషా, కంటోన్మెంట్-రావుల శ్రీధర్ రెడ్డిని నియమించింది.

Similar News

News January 14, 2026

అక్రమ బంగ్లాదేశీయులను గుర్తించేందుకు AI టూల్: MH సీఎం

image

అక్రమ బంగ్లాదేశీయుల అంశం ప్రధాన సమస్య అని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ అన్నారు. వారిని గుర్తించేందుకు IIT బాంబేతో కలిసి AI టూల్‌ను తాము అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం వర్క్ కొనసాగుతోందని, AI టూల్ సక్సెస్ రేటు 60 శాతంగా ఉందని పేర్కొన్నారు. అక్రమంగా ముంబైకి వచ్చిన బంగ్లా పౌరులను పంపించేందుకు డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత కూడా ఇది కొనసాగుతుందని చెప్పారు.

News January 14, 2026

WPLలోనే తొలి ప్లేయర్

image

మహిళా ప్రీమియర్ లీగ్(WPL)లో రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగిన తొలి ప్లేయర్‌గా గుజరాత్ జెయింట్స్ బ్యాటర్ ఆయుషి సోనీ రికార్డులకెక్కారు. ముంబైతో మ్యాచులో 11 బంతుల్లో 14 పరుగులు చేసిన ఆమె భారీ షాట్లు ఆడటంలో తడబడ్డారు. దీంతో చేసేదేమీ లేక రిటైర్డ్ ఔట్‌గా క్రీజును వీడారు. ఆ తర్వాత వచ్చిన ఫుల్మాలి 15 బంతుల్లో 3 సిక్సర్లు, 3 ఫోర్లతో 36 రన్స్ చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.

News January 14, 2026

BJPలోకి హరీశ్ అని ప్రచారం.. ఖండించిన BRS

image

TG: మాజీ మంత్రి హరీశ్ రావు బీజేపీలో చేరబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని BRS ఖండించింది. స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు ఇలాంటి చిల్లర ప్రచారాలు చేస్తున్నారని, వీటిని ఎవరూ నమ్మవద్దని ట్వీట్ చేసింది. కాగా ఇప్పటికే హరీశ్ కేంద్రమంత్రి అమిత్ షాతో చర్చలు జరిపారని ఓ వాట్సాప్ మెసేజ్ చక్కర్లు కొడుతోంది. 17 మంది ఎమ్మెల్యేలతో కలిసి హరీశ్ కమలం గూటికి వెళ్లబోతున్నారని అందులో ఉంది.