News April 6, 2024
రూ.100 కోట్ల వసూళ్లు దాటేసింది

మలయాళం సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘ది గోట్ లైఫ్’. తెలుగులో ‘ఆడు జీవితం’గా విడుదలైంది. మొత్తం ఐదు భాషల్లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసినట్లు చిత్రయూనిట్ పేర్కొంది. ఈ మూవీ ‘ఆడు జీవితం’ నవల ఆధారంగా తెరకెక్కిన సంగతి తెలిసిందే.
Similar News
News October 19, 2025
MLAనూ వదల్లేదు.. రూ.1.07 కోట్లు దోపిడీ

AP: డిజిటల్ అరెస్టుల పేరుతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సామాన్యులనే కాదు నేతలనూ వదలడం లేదు. TDPకి చెందిన ఓ MLA సైతం రూ.1.07 కోట్లు సమర్పించుకున్నారు. ముంబై సైబర్ క్రైమ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నామని, మీపై మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ వారెంట్ వచ్చిందని భయపెట్టారు. దీంతో సదరు MLA డబ్బులు బదిలీ చేశారు. అయినా వదలకపోవడంతో ఆయన HYD క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News October 19, 2025
ఆసీస్‌పై పైచేయి సాధిస్తామా?

నేడు భారత్, AUS మధ్య 3 వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు ఇరు జట్లు 152సార్లు తలపడగా ఆసీస్ 84 మ్యాచుల్లో గెలిచి ఆధిపత్యం చెలాయిస్తోంది. అటు ఆ దేశంలోనూ మన రికార్డ్ పేలవంగానే ఉంది. 54 వన్డేల్లో కేవలం 14సార్లే మనం గెలిచాం. ఈ క్రమంలో తాజా సిరీస్‌ను కైవసం చేసుకొని పైచేయి సాధించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇవాళ తొలి వన్డే జరిగే పెర్త్‌లో పరుగులు రాబట్టడం కష్టమే అని క్రీడా విశ్లేషకుల అంచనా.
News October 19, 2025
దీపావళి: లక్ష్మీ పూజలు ఏ రోజున జరపాలి?

ఈ సంవత్సరం దీపావళి పండుగను అక్టోబర్ 20వ తేదీన జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. అమావాస్య ఘడియలు సూర్యాస్తమయానికి ఆ రోజునే ఉండటంతో.. అదే రోజు దీపావళిని జరుపుకోవడం శ్రేయస్కరం అని అంటున్నారు. ‘లక్ష్మీదేవి పూజ కోసం శుభ ముహూర్తం అక్టోబర్ 20న రాత్రి 7.08 గంటల నుంచి 8.18 గంటల వరకు ఉంటుంది. భక్తులు ఈ ప్రదోష కాలంలో లక్ష్మీ పూజ చేసి, దీపాలు వెలిగించి, అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు’ అని సూచిస్తున్నారు.