News April 6, 2024
కంటోన్మెంట్ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్
TG: కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలో తమ పార్టీ తరఫున శ్రీగణేశ్ బరిలో ఉంటారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇటీవల ఆయన బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.
Similar News
News January 9, 2025
అప్పుడే నా వివాహం: అనన్య పాండే
ఐదేళ్ల తర్వాతే తాను పెళ్లి పీటలు ఎక్కుతానని హీరోయిన్ అనన్య పాండే స్పష్టం చేశారు. ఫోర్బ్స్ ఇండియా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. ‘అందరిలాగే తప్పకుండా పెళ్లి చేసుకుంటా. కొత్త ఇల్లు నిర్మించుకోవాలి. ఇంటి నిండా కుక్కలను పెంచుకోవాలి. ఆ తర్వాత వివాహం చేసుకుంటా’ అని తెలిపారు. కాగా మాజీ మోడల్ వాకర్ బ్లాంకోతో అనన్య డేటింగ్ చేస్తున్నట్లు టాక్. అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లికి వీరిద్దరూ కలిసే హాజరయ్యారు.
News January 9, 2025
తొక్కిసలాట చాలా బాధాకరం: జగన్
AP: తిరుపతి తొక్కిసలాట ఘటనపై YCP చీఫ్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్వామి దర్శనం కోసం టోకెన్లు జారీ చేస్తున్న కేంద్రం వద్ద తొక్కిసలాట జరగడం బాధాకరమన్నారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తక్షణం అక్కడ పరిస్థితులను చక్కదిద్దడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
News January 8, 2025
మూడు గ్రామాలను వణికిస్తోన్న బట్టతల సమస్య
MH బుల్దానాలోని బోర్గాం, కల్వాడ్, హింగానా గ్రామాల ప్రజలను జుట్టు రాలుడు సమస్య ఆందోళనకు గురిచేస్తోంది. వారం రోజుల వ్యవధిలోనే చాలా మందికి జుట్టు రాలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే గ్రామాల్లోని నీటి నమూనాలను పరీక్షలకు పంపారు. దాదాపు 50 మంది ఈ సమస్యతో వైద్యులను సంప్రదించగా బాధితుల నుంచి శాంపిల్స్ తీసుకున్నారు. కాగా కలుషిత నీరు కారణంగానే ఇలా జరిగిందని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు.