News September 30, 2025
నరసాపురం తీరంలో విషపుటీగల గూడులు

నరసాపురం తీర ప్రాంతంలో విషపుటీగల గూడులు దర్శనమిస్తున్నాయి. ఇటీవల నరసాపురం మండలం వేములదీవి వెస్ట్ కాపులకొడప గ్రామంలో భార్యభర్తలపై ఇవి దాడి చేశాయి. 2004 సునామీ తరువాత సముద్రం మీదగా నరసాపురం తీర ప్రాంతానికి వచ్చిన ఈ విషపు ఈగలు పశ్చిమ గోదావరి జిల్లా తీర ప్రాంతంలో తిష్ట వేశాయి. గతంలో పేరుపాలెం, పెదమైనవానిలంక గ్రామంలో వీటి దాడిలో పలువురు ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు ఉన్నాయి.
Similar News
News October 1, 2025
అభివృద్ధికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి: మంత్రి వర్మ

కేంద్ర ప్రభుత్వం పథకాల అమలు జిల్లా సమగ్ర అభివృద్ధికి అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ అన్నారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్‌లో జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ(దిశ) సమావేశం నిర్వహించారు. ప్రధానమంత్రి ముద్ర యోజన కింద బ్యాంకులు లబ్ధిదారులకు విరివిగా రుణాలు మంజూరు చేసి పేద వర్గాలకు ఆర్థికంగా చేయూత నివ్వాలన్నారు. ఎమ్మెల్యేలు, కలెక్టర్ పాల్గొన్నారు.
News September 30, 2025
తణుకు: పోలీసులకు సవాలుగా మారిన దొంగతనం కేసు

తణుకు వారణాసివారి వీధిలో ఇటీవల సంచలనం రేకెత్తించిన చోరీ వ్యవహారం పోలీసులకు సవాలుగా మారింది. ఒంటరిగా జీవిస్తున్న వృద్ధురాలు వాకలపూడి కనకదుర్గను బెదిరించి 70 కాసులు బంగారు ఆభరణాలు దుండగులు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. అయితే పొరుగు రాష్ట్రాలకు చెందిన నిందితులు దోపిడీ అనంతరం మహారాష్ట్ర పారిపోయినట్లు సమాచారం. దీంతో బృందాలుగా విడిపోయిన పోలీసు సిబ్బంది వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
News September 30, 2025
ఆకివీడు: జాబ్ పోయింది.. ఈఎంఐలు కట్టలేక సూసైడ్

ఆకివీడు శ్రీరాంపురం ప్రాంతానికి చెందిన పాలకుర్తి సంతోశ్ కుమార్(35) ఇంటి వరండాలో మెడకు చీర బిగించుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని అమెజాన్ కంపెనీలో సంతోశ్ ఉద్యోగం చేసేవాడు. 3 నెలల క్రితం అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. ఈఎంఐలు చెల్లించలేక మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సెల్ఫీ సూసైడ్ వీడియోను చనిపోయే ముందు భార్యకు పంపాడు.