News September 30, 2025
NLG: జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయుధ పూజ

విజయదశమి పర్వదినం సందర్భంగా నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం ఆయుధ పూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ ముఖ్య అతిథిగా హాజరై ఆయుధాలకు, పోలీసు వాహనాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో విజయాన్ని, సుఖసంతోషాలను తీసుకురావాలని ఆకాంక్షించారు.
Similar News
News November 1, 2025
మూగజీవాలకు కష్టాలు.. నట్టల మందుల సరఫరా నిలిపివేత

నల్గొండ జిల్లాలో గత రెండేళ్లుగా పశుసంవర్ధక శాఖ మేకలు, గొర్రెలకు నట్టల నివారణ మందులు సరఫరా చేయకపోవడంతో కాపరులు ప్రైవేటుపై ఆధారపడుతున్నారు. జిల్లాలో సుమారు 12 లక్షల గొర్రెలు, 2 లక్షల మేకలు ఉన్నట్లు అంచనా. స్టాక్ త్వరలో వస్తుందని, అందిన వెంటనే పంపిణీ చేస్తామని ఏడీ రమేష్ బాబు తెలిపారు.
News November 1, 2025
చేప పిల్లల పంపిణీకి ముహూర్తం ఖరారు!

జిల్లాలో చేప పిల్లల పంపిణీకి ముహూర్తం ఖరారైంది. జిల్లాకు 5.98 కోట్ల చేప పిల్లలు కావాలని మత్స్యశాఖ అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఈనెల రెండో తేదీన నకిరేకల్ పట్టణంలోని పెద్ద చెరువులో చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. జిల్లాలో సుమారుగా 60 వేల మంది మత్స్య కార్మికులకు ఉచిత చేప పిల్లల పంపిణీ ద్వారా లబ్ధి చేకూరనుంది.
News November 1, 2025
జిఎన్ఎం కోర్సులో శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

నల్గొండ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ జనరల్ నర్సింగ్, మిడ్ వైపరీ (జీఎన్ఎం) 3 సంవత్సరాల శిక్షణ కోర్సులో ప్రవేశానికి అర్హత గల పురుష, మహిళా అభ్యర్థుల నుంచి నవంబరు 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని జిల్లా వైద్యశాఖ అధికారి పుట్ల శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు డిఎంహెచ్వో కార్యాలయంలో సంప్రదించాలని ఆయన తెలిపారు.


