News April 6, 2024

కాంగ్రెస్ ప్రభుత్వం మానవత్వం కోల్పోయింది: హరీశ్

image

TG: మోసపూరిత వాగ్దానాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని BRS MLA హరీశ్ రావు విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు ‘రైతు దీక్ష’లు చేపట్టారు. సంగారెడ్డిలో చేపట్టిన దీక్షలో ఆయన మాట్లాడారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం మానవత్వం కోల్పోయింది. రాష్ట్రంలో మళ్లీ కరెంట్ కోతలు మొదలయ్యాయి. మోటార్లు కాలిపోతున్నాయి. రైతులకు పుట్టెడు కష్టాలు వచ్చాయి. రైతులకు ఇచ్చిన ఏ హామీలనూ నెరవేర్చలేదు’ అని మండిపడ్డారు.

Similar News

News January 9, 2025

తొక్కిసలాట చాలా బాధాకరం: జగన్

image

AP: తిరుపతి తొక్కిసలాట ఘటనపై YCP చీఫ్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్వామి దర్శనం కోసం టోకెన్లు జారీ చేస్తున్న కేంద్రం వద్ద తొక్కిసలాట జరగడం బాధాకరమన్నారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తక్షణం అక్కడ పరిస్థితులను చక్కదిద్దడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

News January 8, 2025

మూడు గ్రామాలను వణికిస్తోన్న బట్టతల సమస్య

image

MH బుల్దానాలోని బోర్గాం, కల్వాడ్, హింగానా గ్రామాల ప్రజలను జుట్టు రాలుడు సమస్య ఆందోళనకు గురిచేస్తోంది. వారం రోజుల వ్యవధిలోనే చాలా మందికి జుట్టు రాలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే గ్రామాల్లోని నీటి నమూనాలను పరీక్షలకు పంపారు. దాదాపు 50 మంది ఈ సమస్యతో వైద్యులను సంప్రదించగా బాధితుల నుంచి శాంపిల్స్ తీసుకున్నారు. కాగా కలుషిత నీరు కారణంగానే ఇలా జరిగిందని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు.

News January 8, 2025

వైకుంఠ దర్శనం కోరితే వైకుంఠానికి పంపుతారా: VHP

image

తిరుపతి తొక్కిసలాటలో భక్తురాలి మృతిపై VHP రాష్ట్ర కార్యదర్శి తనికెళ్ల సత్య రవికుమార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భక్తులు వైకుంఠ దర్శన టికెట్ల కోసం వస్తే ఏకంగా వైకుంఠానికి పంపే దుస్థితి TTDలో ఉందని ధ్వజమెత్తారు. 5 లక్షల మంది హాజరైన హైందవ శంఖారావం చక్కగా జరిగితే, నేడు TTD 75 వేల మంది వస్తేనే ఇలా చేసిందన్నారు. బాధిత కుటుంబానికి నష్ట పరిహారం ఇవ్వడంతో పాటు బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.