News April 6, 2024
మాధవీలతకు Y+ సెక్యూరిటీ

హైదరాబాద్‌లో అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేస్తున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు కేంద్రం Y+ సెక్యూరిటీ కల్పించింది. వీఐపీ సెక్యూరిటీలో భాగంగా 11 మంది ఆమెకు పహారా కాస్తారు. ఆరుగురు CRPF పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు ఆమె వెంట ఉండగా, ఐదుగురు గార్డులు ఆమె నివాసం వద్ద సెక్యూరిటీగా ఉండనున్నారు. రాజకీయ నాయకులతో పాటు వ్యాపారవేత్తలకూ కేంద్రం Y+ భద్రత కల్పించవచ్చు.
Similar News
News January 2, 2026
‘SIR’ను త్వరగా మొదలుపెట్టండి.. జనసేన సూచన

AP: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)ను త్వరగా రాష్ట్రంలో ప్రారంభించాలని ఎన్నికల సంఘాన్ని జనసేన పార్టీ కోరింది. ఢిల్లీలోని ఈసీ కార్యాలయంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌తో జనసేన ప్రతినిధులు భేటీ అయ్యారు. దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా, బలోపేతంగా మార్చేందుకు ఈసీ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు కొనసాగిస్తోంది. ఇప్పటికే టీడీపీ SIR, AI వినియోగంపై ప్రతిపాదనలు చేసింది.
News January 2, 2026
మహిళల కోసం కొత్త స్కీమ్.. వివరాలివే

TG: మహిళా సంఘాల సభ్యుల కోసం ప్రభుత్వం ‘ఇందిరా డెయిరీ ప్రాజెక్టు’ను తీసుకొచ్చింది. ఒక్కొక్కరికి 2 పాడి గేదెలు/ఆవులు అందించనుంది. పైలట్ ప్రాజెక్టుగా ఖమ్మం(D) మధిర నియోజకవర్గంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. కొడంగల్ సహా ఇతర ప్రాంతాలకూ విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఒక్కో యూనిట్ ధర రూ.2లక్షలు కాగా అందులో ప్రభుత్వం ₹1.40లక్షలు సబ్సిడీ ఇస్తుంది. మిగతా ₹60వేలు బ్యాంకులు లోన్ ఇస్తాయి.
News January 2, 2026
బాలింతలు ఏం తినాలంటే?

ప్రసవమయ్యాక కొన్నిరోజులపాటు బాలింతకు తేలికగా జీర్ణమయ్యే, బలవర్ధకమైన ఆహారం ఇవ్వాలి. అప్పుడే బిడ్డకు సరిపడా పాలు పడతాయి. పాలు, నెయ్యి ఎక్కువగా తీసుకోవాలి. బీర, పొట్ల, సొర, కాకర, క్యారెట్, బీట్రూట్, బెండ వంటి కూరగాయలు ఆహారంలో చేర్చుకోవాలి. కిచిడీ, పులగన్నం తీసుకోవాలి. వెల్లుల్లి, మెంతులు, జీలకర్ర, ధనియాలు, ఇంగువ ఆహారంలో ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇవి గర్భాశయ ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.


