News September 30, 2025

స్త్రీశక్తి విజయంపై ఆర్టీసీ సిబ్బందికి సీఎం అభినందనలు: ఆర్‌ఎం

image

స్త్రీశక్తి పథకం విజయవంతం కావడంతో సీఎం చంద్రబాబు ఆర్టీసీ సిబ్బందికి అభినందనలను తెలిపినట్లు రీజనల్ మేనేజర్ బి.అప్పలనాయుడు సిబ్బందికి చెప్పారు. మంగళవారం వాల్తేరు, గాజువాక, స్టీల్ సిటీ, సింహాచలం డిపోల్లో ఆయన పర్యటించారు. పథకాన్ని మరింత మెరుగుపరిచి ప్రజల మన్ననలు పొందేలా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

Similar News

News September 30, 2025

అగ్నిమాపక నోటీసులపై మంత్రి అనిత సమీక్ష

image

హోంమంత్రి వంగలపూడి అనిత సీఐఐ ప్రతినిధులతో అగ్నిమాపక శాఖ జారీచేసిన నోటీసులపై సమీక్షించారు. హైకోర్టు ఆదేశాల మేరకే వివరణ కోరామని, ఎన్ఓసీలు రద్దు చేస్తారనేది అపోహ మాత్రమేనని, ఎవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. పరిశ్రమల్లో భద్రతా పరికరాలపై అధ్యయనానికి, టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుకు అంగీకరించారు. బాణసంచా దుకాణాలు భద్రతా నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఆదేశించారు.

News September 30, 2025

భారత్-యూకే వాణిజ్య ఒప్పందంపై సదస్సు

image

విశాఖపట్నం స్పెషల్ ఎకనామిక్ జోన్ (VSEZ) ఆధ్వర్యంలో భారత్-యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ ఒప్పందంలో సుంకం లేని యాక్సెస్, మార్కెట్ అవకాశాలు వంటి ప్రయోజనాలను అధికారులు ఎగుమతిదారులకు వివరించారు. యూకేకు ఎగుమతుల కోసం నాణ్యతా ప్రమాణాలు మెరుగుపరచుకోవాలని నిపుణులు సూచించారు.

News September 30, 2025

విశాఖ జూలో రెండు ఆసియా సింహం పిల్లల జననం

image

విశాఖలోని ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్‌లో రెండు ఆసియా సింహం పిల్లలు జన్మించాయి. తల్లి, పిల్లలు ఆరోగ్యంగా ఉన్నాయిని, ప్రస్తుతం పశువైద్యుల పర్యవేక్షణలో ఉన్నాయని జూ క్యూరేటర్ జి.మంగమ్మ మంగళవారం తెలిపారు. అంతరించిపోతున్న జాతిగా నమోదైన ఆసియా సింహాల సంతానోత్పత్తి, పరిరక్షణ ప్రయత్నాల్లో ఈ జననం ఒక విజయమని ఆమె పేర్కొన్నారు.