News April 6, 2024

పటాన్ చెరు: కారు రన్నింగ్‌లో ఉండగా రివర్స్ గేర్.. యువకుడి మృతి

image

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన పటాన్‌చెరు PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. శాంతినగర్‌కు చెందిన భగీరథ కుమార్(19), అతడి స్నేహితుడు నిఖిల్ కుమార్‌తో కలిసి శుక్రవారం ముత్తంగి పరిధిలో హోటల్‌కి వచ్చి తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో కారు రన్నింగ్‌లో ఉండగా నిఖిల్ కుమార్ రివర్స్ గేర్ వేయడంతో చెట్టును ఢీకొంది. భగీరథకు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Similar News

News January 2, 2026

నర్సాపూర్ బీవీఆర్ఐటీలో టెట్ పరీక్షా కేంద్రం

image

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG-TET)పరీక్షను జిల్లాలో నర్సాపూర్ BVRITలో ఏర్పాటు చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి విజయ తెలిపారు. ఈనెల 4న ఉ.9 నుంచి 11.30 గంటల వరకు, మ.2 నుంచి సా.4.30 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. మొత్తం 400 మంది అభ్యర్థులు హాజరు కానున్నారన్నారు. హాల్ టికెట్లను https://tgtet.aptonline.in/tgtet వెబ్‌సైట్‌ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చన్నారు.

News January 2, 2026

మెదక్: ‘విద్యావంతులే బలవుతున్నారు’

image

మెదక్‌లో సైబర్ వారియర్స్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. విద్యావంతులే ఎక్కువగా సైబర్ మోసాలకు బలవుతున్నారని, అవగాహన లోపం, అత్యాశే కారణమని పోలీసులు తెలిపారు. APK ఫైళ్లు, అనధికారిక లోన్ యాప్‌లు, పెట్టుబడి, ఆన్‌లైన్ బెట్టింగ్, డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లపై అవగాహన కల్పించారు. అనుమానాస్పద లింకులు క్లిక్ చేయవద్దని, సైబర్ నేరాలకు గురైతే 1930 లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలన్నారు.

News January 1, 2026

మెదక్: ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి: కలెక్టర్

image

ప్రజలందరూ ఆనందంగా సుఖసంతోషాలతో పాడిపంటలతో ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. నూతన సంవత్సరం పురస్కరించుకొని మెదక్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కుటుంబ సమేతంగా దర్శించుకుని పూజలు నిర్వహించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలిగి ఉండాలని భగవంతుని ప్రార్థించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.