News April 6, 2024
షర్మిల ‘హంతకుడి’ వ్యాఖ్యలపై స్పందించిన అవినాశ్ రెడ్డి

AP: తాను వివేకాను హత్య చేసిన హంతకుడినంటూ వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలను ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని కడప ఎంపీ అవినాశ్ రెడ్డి అన్నారు. ‘ఆ కామెంట్స్ వినడానికే భయంకరంగా ఉన్నాయి. మసిపూసి బూడిద జల్లి తుడుచుకోమంటారు. తుడుచుకుంటూ పోతే తిడుతూనే ఉంటారు. మాట్లాడేవాళ్లు మనుషులైతే, వారిది మనిషి పుట్టుకే అయితే విజ్ఞత, విచక్షణ ఉండాలి’ అని అవినాశ్ మండిపడ్డారు.
Similar News
News April 24, 2025
SRH ఘోర ఓటమి

IPLలో SRH ఓటముల పరంపర కొనసాగుతోంది. ఇవాళ ఉప్పల్‌లో ముంబైతో జరిగిన మ్యాచులో 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. 144 పరుగుల టార్గెట్‌ను ముంబై 15.4 ఓవర్లలోనే ఛేదించింది. రోహిత్ శర్మ 70 రన్స్‌తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. సూర్య 40*, జాక్స్ 22 రన్స్ చేశారు. ఈ ఓటమితో SRH ప్లే ఆఫ్స్ ఆశలు దాదాపు గల్లంతు కాగా ముంబైకి ఇది వరుసగా నాలుగో విజయం.
News April 23, 2025
పాత బెడ్‌పై నిద్రిస్తున్నారా?

మనం పడుకునే బెడ్ కూడా నిద్రను ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఏడేళ్లకు మించి ఒకే పరుపును ఉపయోగించడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. పాత బెడ్‌పై నిద్రిస్తే చేతులు, కాళ్ల నొప్పులతోపాటు నిద్రలేమి సమస్య వెంటాడుతుంది. వెన్నునొప్పి సమస్యకు దారితీస్తుంది. పరుపుల తయారీలో వాడే నాఫ్తలీన్, బెంజీన్ వంటి వాటి వల్ల అలర్జీ, దురద, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదముంది. 2-3 ఏళ్లకోసారి బెడ్స్‌ను మార్చడం బెటర్.
News April 23, 2025
టీ20ల్లో 12వేల పరుగుల క్లబ్‌లోకి హిట్‌మ్యాన్

SRHతో జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్ శర్మ టీ20ల్లో 12 వేల పరుగులు పూర్తి చేసుకున్నారు. 456 మ్యాచుల్లో హిట్‌మ్యాన్ ఈ ఘనత సాధించారు. ఈ 12K T20 క్లబ్లో కోహ్లీ తర్వాత చోటు దక్కించుకున్న రెండో భారత ప్లేయర్‌గా రికార్డ్ సృష్టించారు. ఓవరాల్ T20 క్రికెట్లో 8వ ప్లేయర్‌గా నిలిచారు. 12వేలు పరుగులు చేసిన లిస్టులో గేల్, అలెక్స్ హేల్స్, షోయబ్ మాలిక్, పోలార్డ్, కోహ్లీ, డేవిడ్ వార్నర్, జోష్ బట్లర్ ఉన్నారు.