News October 1, 2025

ఆటో డ్రైవర్లకు రూ.15వేలు.. ఈ లిస్టులో మీ పేరు ఉందా?

image

AP: వాహనమిత్ర స్కీమ్ కింద ఆటో/క్యాబ్ డ్రైవర్ల ఖాతాల్లో ప్రభుత్వం ఈ నెల 4న రూ.15వేలు జమ చేయనుంది. అర్హులు తమ ఆధార్ నంబర్‌తో స్టేటస్ చెక్ చేసుకునేందుకు ప్రభుత్వం ఛాన్స్ ఇచ్చింది. <>NBM<<>> సైట్ ఓపెన్ చేసి పైన కనిపించే Application Statusపై క్లిక్ చేయాలి. అందులో Auto Driver Sevaloని సెలక్ట్ చేసుకోవాలి. ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే చాలు మీరు ఈ పథకానికి అర్హులో? కాదో? తెలుస్తుంది.

Similar News

News February 10, 2026

‘కవిత్వం నేర్చుకుంటా’.. ఆంథ్రోపిక్ ఇంజినీర్ రాజీనామా!

image

<<19068101>>టెక్ సంచలనం<<>> ‘ఆంథ్రోపిక్‌’లో ఏఐ సేఫ్టీ ఇంజినీర్ మృణాంక్ శర్మ రాజీనామా కలకలం రేపింది. ‘AI, బయో వెపన్లతోనే కాదు.. ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యే సంక్షోభాల వల్ల కూడా ప్రపంచం ప్రమాదంలో ఉంది. ప్రపంచాన్ని ప్రభావితం చేసే సామర్థ్యానికి సమానంగా మన జ్ఞానం పెరిగినట్లుగా కనిపిస్తోంది’ అని పేర్కొన్నారు. విలువలను కోల్పోతున్నామని, ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నామని రాసుకొచ్చారు. కవిత్వంలో డిగ్రీ చేస్తానని తెలిపారు.

News February 10, 2026

చిన్నారి ప్రాణం తీసిన బాటిల్ మూత.. తల్లిదండ్రులారా జాగ్రత్త!

image

పలానా వస్తువు గొంతులోకి వెళ్తే ప్రమాదమని పసి పిల్లలకేం తెలుసు. కనిపించిందల్లా నోట్లో పెట్టుకుంటారు. అప్పుడప్పుడు ఇలాంటివి విషాదాలుగా మారుతాయి. అందుకే తల్లిదండ్రులే అప్రమత్తంగా ఉంటూ పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకోవాలి. తాజాగా యాదాద్రి(D) భూదాన్(M) ఇంద్రియాలలో 18 నెలల భవ్యశ్రీ ఆడుకుంటూ కూల్‌ డ్రింక్ మూత మింగింది. గొంతులో ఇరుక్కోవడంతో చనిపోయింది. అందుకే పిల్లలకు మూతలు, నాణేలు వంటివి దూరంగా ఉంచాలి.

News February 10, 2026

హోం క్లీనింగ్ టిప్స్..

image

* ఓవెన్‌లో వెనీలా ఎసెన్స్ ఉంచి కొద్దిసేపు వేడి చేస్తే లోపలి దుర్వాసనలు దూరమవుతాయి. * నూనె డబ్బాల మీద బంగాళా దుంప ముక్కలతో రుద్దితే తుప్పు మరకలు అంటుకోకుండా ఉంటాయి. * రెండు కప్పుల నీటిలో పావుకప్పు వెనిగర్, నాలుగు చుక్కలు పాత్రలు తోముకునే సబ్బు నీళ్ళు కలిపి, దానిలో ముంచిన వస్త్రంతో కిటికీలను తుడిస్తే పేరుకున్న దుమ్ముపోతుంది. * వెండి వస్తువుల గార పోవాలంటే పచ్చిపాలతో రుద్ది కడగాలి.