News October 1, 2025

రూ.217 కోట్లకు ట్రంప్‌తో యూట్యూబ్ సెటిల్‌మెంట్

image

తన యూట్యూబ్ అకౌంట్‌ను బ్యాన్ చేసిందని ట్రంప్ గతంలో ఆ సంస్థపై కేసు వేసిన విషయం తెలిసిందే. తాజాగా YouTube ఆయనతో రూ.217.64($24.5 మి) కోట్లకు సెటిల్‌మెంట్ చేసుకుంది. ఈ మొత్తంలో $22 మి. నేషనల్ మాల్ ట్రస్టుకు, $2.5 మి. ఇతర సంస్థలకు చెల్లించనుంది. SM దిగ్గజాలు, మీడియా సంస్థలపై పరువునష్టం దావాలేసి ట్రంప్‌ $90.5 మి. పొందారు. FB $25మి., X $10మి., ABC న్యూస్ $15మి., 60 మినిట్స్ $16మి.కు సెటిల్ చేసుకున్నాయి.

Similar News

News February 19, 2026

షాకిచ్చిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹2,290 పెరిగి ₹1,56,490కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు ₹2,100 ఎగబాకి ₹1,43,450 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ ధర ఏకంగా ₹10 వేలు పెరిగి ₹2,70,000గా ఉంది. ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప తేడాలు ఉండొచ్చు.

News February 19, 2026

రాష్ట్ర పండుగగా రాజాం పైడితల్లి అమ్మవారి జాతర

image

AP: విజయనగరం(D) రాజాంలోని శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతరను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించింది. ఉత్సవాలకు రూ.50లక్షల నిధుల మంజూరుకు ఆదేశాలిచ్చింది. తదుపరి చర్యలు తీసుకోవాలని దేవదాయశాఖ కమిషనర్‌ను ఆదేశించింది. పైడితల్లి ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు. అమ్మవారి ఉత్సవాలు 1758 నుంచి ఏటా నిరాటంకంగా కొనసాగుతున్నాయి.

News February 19, 2026

స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

image

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాల్లో పయనిస్తున్నాయి. సెన్సెక్స్ 28 పాయింట్లు లాభపడి 83,762 వద్ద.. నిఫ్టీ 12 పాయింట్లు పెరిగి 25,831 దగ్గర కొనసాగుతున్నాయి. సెన్సెక్స్-30 సూచీలో HCL, టెక్ మహీంద్రా, TCS, ఇన్ఫీ షేర్లు లాభాల్లో.. ఇండిగో, KWIL, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.