News October 1, 2025
CM చంద్రబాబుపై బాంబు దాడి.. నేటికి 22 ఏళ్లు.!

అది అక్టోబర్ 1వ తేదీ 2003. తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు చంద్రబాబు CM హోదాలో తిరుమలకు వస్తున్నారు. సరిగ్గా అలిపిరి తనిఖీ కేంద్రం వద్దకు రాగానే ఒక్కసారిగా బాంబు శబ్దం. అందరూ తేరుకునేలోపే CM ఉన్న కారు గాల్లోకి ఎగిరి పడగా చంద్రబాబు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనకు నేటితో 22 ఏళ్లు. శ్రీవారి దయతోనే తాను ప్రాణాలతో బయటపడినట్లు పలు సందర్భాల్లో CM వ్యాఖ్యానించారు.
Similar News
News October 1, 2025
నెల్లూరు జిల్లా 2వ స్థానం

జిల్లా లో 2025 – 26 సం.కు గాను ఇన్‌స్పైర్ – మనక్ నామినేషన్లు విశేష స్పందన లభించినట్లు జిల్లా సైన్స్ అధికారి శివారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అన్నమయ్య జిల్లా మొదటి స్థానంలో నిలువగా నెల్లూరు జిల్లా రెండో స్థానంలో నిలిచినట్లు ఆయన తెలిపారు. జిల్లాలో 711 పాఠశాలలు నుంచి 2925 నామినేషన్లు అందినట్లు చెప్పారు. అన్నమయ్య జిల్లాలో 3 వేలు నామినేషన్ రాగా, నెల్లూరు జిల్లా 2925 నామినేషన్లు వచ్చాయన్నారు.
News October 1, 2025
శ్రీరాజరాజేశ్వరి అమ్మవారి సేవలో కలెక్టర్

నెల్లూరు దర్గామిట్టలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రీదుర్గా అలంకార రూపంలో కొలువైన జగన్మాతను మంగళవారం కలెక్టర్ హిమాన్షు శుక్లా కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తొలుత దేవాదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్ కోవూరు జనార్ధన్ రెడ్డి ఆలయ మర్యాదలతో కలెక్టర్కు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
News October 1, 2025
SP అజితను కలిసిన MP వేమిరెడ్డి

నెల్లూరు MP వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మంగళవారం SP అజితను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా జిల్లాకు వచ్చిన అజితకు MP బొకే అందజేసి శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణపై వారు చర్చించారు.