News April 6, 2024
కొవిడ్ సమయంలోనూ ఏ పథకం ఆపలేదు: సజ్జల
AP: వైసీపీ ప్రభుత్వంలో ప్రతి వ్యవస్థా పారదర్శకంగా పనిచేస్తోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. కొవిడ్ సమయంలోనూ సీఎం జగన్ ఒక్క పథకమూ ఆపకుండా అందించారని గుర్తు చేశారు. చంద్రబాబు అండ్ కో వాలంటీర్ వ్యవస్థపై విష ప్రచారం చేసి వృద్ధులకు ఇంటివద్దే పింఛన్లు ఇవ్వకుండా అడ్డుకుందని మండిపడ్డారు. పురందీశ్వరి ఏ పార్టీలో ఉన్నా చంద్రబాబు కోసమే పనిచేస్తారని ఆరోపించారు.
Similar News
News February 5, 2025
రేపు సీఎల్పీ సమావేశం
TG: రేపు కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) సమావేశం కానుంది. మ.3 గంటలకు హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవవనరుల కేంద్రంలో సీఎం రేవంత్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ నిర్ణయాలపై ఎమ్మెల్యేలకు రేవంత్ దిశానిర్దేశం చేయనున్నారు.
News February 5, 2025
ఢిల్లీలో కాంగ్రెస్‌కు శూన్య హస్తమేనా?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం తప్పదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మెజారిటీ సంస్థలు BJPకి, మరికొన్ని ఆప్‌కు అధికారం దక్కుతుందని తెలిపాయి. కాగా, దాదాపు అన్ని సర్వేల్లోనూ కాంగ్రెస్ ఖాతా తెరవదని చెప్పాయి. 0-3 సీట్లకే ఛాన్స్ ఉందని ఒకట్రెండు తెలిపాయి. దీంతో ఢిల్లీలో కాంగ్రెస్ పని ఖతమైనట్లే అని, ఆప్‌తో పొత్తు పెట్టుకోవాల్సిందని రాజకీయవేత్తలు విశ్లేషిస్తున్నారు.
News February 5, 2025
రేపు జగన్ ప్రెస్‌మీట్
AP: మాజీ సీఎం వైఎస్ జగన్ రేపు కీలక ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడతారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు, ప్రజా సమస్యలపై ఆయన ప్రసంగిస్తారు. కాగా ఇవాళ విజయవాడ కార్పొరేటర్లతో జరిగిన సమావేశంలో జగన్ కూటమి సర్కార్‌పై ఫైర్ అయ్యారు. ఈసారి జగనన్న 2.0 వేరే లెవెల్‌లో ఉంటుందని కూటమి సర్కార్‌ను ఆయన హెచ్చరించారు.