News April 6, 2024

ప్రతీ పేదవాడి గుండెల్లో జగన్: మంత్రి గుడివాడ

image

ఏపీలోని ప్రతీ పేదవాడి గుండెల్లో వైఎస్ జగన్ ఉన్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ‘వచ్చే ఎన్నికల్లో జగన్‌కే ఓటేయాలని అందరూ అనుకుంటున్నారు. జగన్‌ను సీఎం చేసేందుకు నేనేమైనా చేస్తా. సీఎం రమేశ్ నాన్ లోకల్. ఎంపీ నిధుల నుంచి ఆయన అనకాపల్లిలో రూపాయైనా ఖర్చు చేశారా? ఆయన ఇక్కడ గెలవరు. ఎన్నికల తర్వాత రమేశ్ చెవిలో పువ్వు పెట్టుకుని వెళ్లిపోవడమే’ అని అమర్నాథ్ దుయ్యబట్టారు.

Similar News

News February 5, 2025

హీరోపై కేసు నమోదు!

image

స్వయంవరం, చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్ వంటి సినిమాల్లో హీరోగా నటించిన వేణు తొట్టెంపూడిపై కేసు నమోదైంది. ఆయన ప్రతినిధిగా ఉన్న ‘ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్’ కంపెనీ ఉత్తరాఖండ్ జల విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన కాంట్రాక్ట్ దక్కించుకుంది. ఈ క్రమంలో ఒప్పందాన్ని ఉల్లంఘించారని ఆయనతో పాటు సంస్థ సభ్యులపై కేసు నమోదు చేశారు. కాగా ఆయన రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు.

News February 5, 2025

ఇండియాలో కాలుష్యంపై బ్రయాన్ ఏమన్నారంటే?

image

అమెరికన్ మిలియనీర్ బ్రయాన్ జాన్సన్ ఇండియాలో పర్యటిస్తుండగా నిఖిల్ కామత్ ఇంటర్వ్యూ నుంచి మధ్యలోనే నిష్క్రమించడం చర్చనీయాంశమైంది. దీనికి కారణం కాలుష్యమేనని బ్రయాన్ చెప్పుకొచ్చారు. ‘గాలి నాణ్యత సరిగా లేకపోవడంతో నేను ఇంటర్వ్యూ మధ్యలో ఆపేశా. వాయుకాలుష్యం వల్ల నా చర్మంపై దద్దుర్లు వచ్చాయి. కళ్లు, గొంతు మండిపోతున్నాయి. నేను తెచ్చిన ఎయిర్ ప్యూరిఫయర్ కూడా కాలుష్యానికి పాడైంది’ అని చెప్పారు.

News February 5, 2025

ప్రైవేటు వీడియోల కేసు.. డ్రగ్ టెస్ట్‌లో నిందితులకు పాజిటివ్

image

అమ్మాయిల ప్రైవేట్ వీడియోల కేసులో అరెస్టైన మస్తాన్ సాయి రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. డ్రగ్ టెస్ట్‌లో మస్తాన్ సాయి, అతని ఫ్రెండ్ ఖాజాకు పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. దీంతో మస్తాన్‌పై NDPS చట్టం కింద కేసు నమోదు చేశారు. 2022లో తన ఇంట్లో పార్టీ నిర్వహించిన మస్తాన్ సాయి ఆ సమయంలో తనకు డ్రగ్స్ ఇచ్చి ప్రైవేట్ వీడియోలు తీశారని లావణ్య ఫిర్యాదులో పేర్కొన్నారు.

error: Content is protected !!