News October 1, 2025
నిర్ణీత లక్ష్యం మేరకు రైస్ డెలివరీ పూర్తి చేయాలి: అ.కలెక్టర్

నిర్ణీత లక్ష్యం మేరకు రైస్ డెలివరీ పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అన్నారు. బుధవారం అదనపు కలెక్టర్, కలెక్టరేట్లో పెండింగ్ రా రైస్ డెలివరీపై రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. జిల్లా నుంచి గత ఖరీఫ్ సీజన్ పెండింగ్ ఉన్న 11 వేల 500 మెట్రిక్ టన్నులు రా రైస్, 3500 మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ రాబోయే 20 రోజులలో ఎఫ్సీఐకు సరఫరా చేయాలని సూచించారు.
Similar News
News October 1, 2025
‘ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వహించాలి’

ఖమ్మం: ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వహించాలని మాస్టర్ ట్రైనర్/ జిల్లా ఉపాధి కల్పన అధికారి శ్రీరామ్ అన్నారు. బుధవారం డీపీఆర్సీ భవనంలో నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులకు, మాస్టర్ ట్రైనర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరు తమకు కేటాయించిన హ్యండ్ బుక్ ఒకటికీ రెండుసార్లు పరిశీలించాలని, ముఖ్యమైన నిబంధనలు మార్క్ చేసి పెట్టుకోవాలని సూచించారు.
News October 1, 2025
హోంగార్డు కుటుంబానికి బీమా చెక్కు అందజేత: CP

గతేడాది మాదారం నుంచి ఖమ్మం విధులకు వెళ్తున్న ఖమ్మం యూనిట్‌కు చెందిన హోంగార్డు చందర్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. కాగా హోంగార్డు కుటుంబానికి యాక్సెస్ బ్యాంక్ సాలరీ అకౌంట్‌తో వచ్చే ప్రయోజనాలు, ప్రమాద బీమా సొమ్ము రూ.34 లక్షల చెక్కు మంజూరైంది. బుధవారం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ హోంగార్డు కుటుంబ సభ్యులకు చెక్కును అందజేశారు.
News October 1, 2025
ఖమ్మం: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు పెద్దపీట

స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేసింది. 42% రిజర్వేషన్ కల్పించడంతో అత్యధిక స్థానాల్లో పోటీ చేసేందుకు అవకాశం దక్కింది. ఖమ్మం జిల్లాలో ZPTC, MPTC, MPP, సర్పంచ్, వార్డుల సభ్యులకు కలిపి రిజర్వేషన్ల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి. STలకు 1,391, SCలకు 1,111, BCలకు 1,783, జనరల్ 1,823 స్థానాలను కేటాయించారు. దీంతో ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీసీలు ఉత్సాహం చూపుతున్నట్లు తెలుస్తోంది.