News October 1, 2025
నిమజ్జనం కోసం 200 మంది పోలీసులతో బందోబస్తు: ఎస్పీ

నేడు జరగనున్న దుర్గా నవరాత్రి నిమజ్జన ఉత్సవాల సందర్భంగా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. వన్ టౌన్, టూ టౌన్, మావల పోలీస్ స్టేషన్ల పరిధిలో సుమారు 80 దుర్గాదేవి నిమజ్జన కార్యక్రమాలు జరగనున్నాయన్నారు. 200 మంది పోలీసు సిబ్బందితో కూడిన బృందాన్ని 9 సెక్టార్లుగా, 4 క్లస్టర్లుగా విభజించి, సీఐ స్థాయి అధికారి పర్యవేక్షణలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
Similar News
News October 26, 2025
కైలాష్ సుందరకాండ పుస్తకాన్ని ఆవిష్కరించిన గవర్నర్

వనవాసి కల్యాణ పరిషత్ ఆధ్వర్యంలో అచ్చంపేటలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొని, తొడసం కైలాస్ మాస్టర్ రచించిన “సోభత ఖడి” సుందరకాండ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీ మాధవి దేవి, హర్యానా మాజీ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ, వనవాసి కల్యాణ పరిషత్ అధికారి శ్రీ రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
News October 26, 2025
ADB: కాంగ్రెస్లో కొత్త ట్రెండ్

కాంగ్రెస్ 42% బీసీ రిజర్వేషన్ ప్రకటించిన నేపథ్యంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుల(డీసీసీ) పదవుల్లో సైతం బడుగులకు ప్రాధాన్యతనివ్వనుంది. నిన్న ఢిల్లీలో జరిగిన పార్టీ ముఖ్యనేతల సమావేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50% అధ్యక్ష పదవులు ఇవ్వాలని, గతంలో ఎలాంటి పదవులు చేపట్టని వారికి పదవులు ఇవ్వాలని నిర్ణయించడంతో జిల్లాలో డీసీసీ పదవి కోసం ఆశిస్తున్న వారిలో ఉత్కంఠ నెలకొంది.
News October 26, 2025
ఆదిలాబాద్: ‘31లోగా బోర్డుకు ఫీజు చెల్లించాలి’

ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లోని ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థుల నుంచి గుర్తింపు ఫీజు (రూ. 220), గ్రీన్ ఫండ్ ఫీజు (రూ.15) కలిపి మొత్తం రూ.235ను ఈనెల 31 లోగా చెల్లించాలని డీఐఈవో జాదవ్ గణేశ్ కుమార్ తెలిపారు. ప్రిన్సిపల్లు tgbie.cgg.gov.in పోర్టల్ ద్వారా చెల్లింపులు చేయాలని ఆయన ఆదేశించారు. సకాలంలో ఫీజు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.


