News April 6, 2024

ముస్లిం మహిళల హిజాబ్ తొలగింపు.. రూ.145కోట్ల పరిహారం!

image

న్యూయార్క్‌లో (US) ఇద్దరు ముస్లిం మహిళలకు బలవంతంగా హిజాబ్ తొలిగించి ఫొటో తీసినందుకు అక్కడి యంత్రాంగం రూ.145కోట్లు చెల్లించాల్సి వచ్చింది. అధికారుల చర్యతో అసౌకర్యానికి గురయ్యామని జమీలా క్లార్క్, అర్వా అజీజ్ 2018లో కేసు వేశారు. తాజాగా న్యూయార్క్ యంత్రాంగం పరిహారం చెల్లించేందుకు ఓకే చెప్పింది. ఈ డబ్బును రూ.6.5లక్షల చొప్పున ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొన్న దాదాపు 4000 మంది మహిళలకు ఇవ్వనున్నారు.

Similar News

News October 9, 2024

డీఎస్సీ: ఎంత మంది ఎంపికయ్యారంటే?

image

TG: డీఎస్సీ పోస్టుల తుది ఫలితాలను విద్యాశాఖ రిలీజ్ చేసింది. మొత్తం 11 వేల 62 పోస్టులకు గానూ 10,006 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు విద్యాశాఖ తెలిపింది. జిల్లాల వారీగా పోస్టుల వివరాలను వెల్లడించింది. మిగిలిన అభ్యర్థుల ఎంపిక పెండింగ్‌లో ఉన్నట్లు పేర్కొంది. ఆ పోస్టుల్లో ఎంపికైన క్యాండిడేట్లు కోర్టు కేసులు, ఇతర కారణాలు ఉండటంతో పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపింది.

News October 9, 2024

గత నెల చరిత్రలో రెండో అత్యంత వేడైన సెప్టెంబర్‌: కోపర్నికస్

image

ఈ ఏడాది సెప్టెంబర్ చరిత్రలో రెండో అత్యంత వేడైన సెప్టెంబర్ అని EU వాతావరణ పర్యవేక్షణ సంస్థ కోపర్నికస్(C3S) తెలిపింది. అత్యంత వేడైన సెప్టెంబరు గత ఏడాది నమోదైందని గుర్తుచేసింది. గత నెలలో తీవ్ర వర్షపాతం, అమెరికాలో హెలీన్, తైవాన్‌లో క్రాతన్, యూరప్‌లో బోరిస్ తుఫాన్లు విధ్వంసాన్ని సృష్టించాయని వివరించింది. పర్యావరణ మార్పు కారణంగా పరిస్థితులు వేగంగా దిగజారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.

News October 9, 2024

ఓలాకు అండగా నిలిచిన హర్ష్ గోయెంకా

image

వివాదంలో చిక్కుకున్న ఓలా ఎలక్ట్రిక్ సంస్థకు వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా అండగా నిలిచారు. తాను చిన్న దూరాలు ప్రయాణించేందుకు ఓలా స్కూటర్‌నే వినియోగిస్తానంటూ ట్వీట్ చేశారు. స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాకు, ఓలా సీఈఓ భవీష్ అగర్వాల్‌కు మధ్య నెట్టింట వాగ్వాదం అనంతరం కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ(CCPA) ఓలా ఎలక్ట్రిక్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అటు సంస్థ షేర్లు సైతం 9శాతం పడిపోయాయి.