News October 1, 2025

ప్రకాశం జిల్లాలో క్రాకర్స్ దుకాణాలపై తనిఖీలు

image

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అక్రమ బాణసంచా నిల్వలకై పోలీసులు గురువారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో.. ఎవరైనా అనుమతులు లేకుండా బాణసంచా తయారీ, నిల్వ చేస్తున్నారనే కోణంలో పోలీసుల తనిఖీలు చేశారు. తనిఖీలపై ఎస్పీ మాట్లాడుతూ.. రానున్న దీపావళి సందర్భంగా క్రాకర్స్ షాపుల యజమానులు తప్పక నిబంధనలు అనుసరించాలన్నారు.

Similar News

News October 2, 2025

ప్రకాశం: మొదలైన దసరా దందా..!

image

దసరా సందర్భంగా పెరిగిన ప్రయాణికుల డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని, ప్రైవేట్ ట్రావెల్స్ సాధారణ ఛార్జీలను అమాంతం పెంచేశాయి. రైళ్లలో సీట్లు నిండిపోవడం, ప్రభుత్వ బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉండటం వంటి పరిస్థితుల్లో ప్రజలు ప్రైవేట్ ట్రావెల్స్ ఆశ్రయించాల్సివస్తుంది. సాధారణంగా ఒంగోలు, కందుకూరు, కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు ప్రాంతాలకు HYD నుంచి రూ.700 ఉండే ధర ఇప్పుడు రూ.1000 పైనే ఉందని ప్రయాణికులు వాపోతున్నారు.

News October 2, 2025

ఎంపీ మాగుంట ఛైర్మన్ పదవీ కాలం పొడిగింపు

image

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పార్లమెంట్ గృహ పట్టణ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఛైర్మన్‌గా ఆయన పదవీకాలం త్వరలో ముగియనుంది. ఈక్రమంలో ఆయన పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగిస్తూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఉత్తర్వులు జారీచేశారు.

News October 1, 2025

అంకుల్ మీతో వస్తాం.. అన్నం పెడతారా!

image

తల్లిని కోల్పోయారు. తండ్రి ఆదరణ లేదు. ఆ ఇద్దరు చిన్నారులకు దిక్కుతోచని స్థితి. ఒంగోలు నుంచి కొత్తపట్నం వెళ్లే దారిలో హెల్ప్ సంస్థ పీడీ సాగర్‌కు ఆ ఇద్దరూ తారసపడ్డారు. ఒకరు 7 ఏళ్ల బాలుడు. మరొకరు 8 ఏళ్ల బాలిక. వీరిని సాగర్ పలకరించి వివరాలు కోరగా అమ్మ చనిపోయిందని, నాన్న ఎక్కడున్నాడో తెలియదని చెప్పారు. ‘అంకుల్ మీతో వస్తాం. అన్నం పెడతారా’ అని కోరడంతో ఆయన వారిని ఒంగోలు బొమ్మరిల్లులో చేర్పించారు.