News October 2, 2025

ప్రధాని పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్ల పరిశీలన

image

ఈనెల 16న ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలుకు వస్తున్నందున భద్రతా ఏర్పాట్లకు సంబంధించి ఎస్పీ విక్రాంత్ పాటిల్ పోలీస్ అధికారులతో చర్చించి, పలు ప్రాంతాలను తనిఖీ చేశారు. నగరంలో జీఎస్టీ సంస్కరణలపై రోడ్డు షో నిర్వహిస్తున్నందున వాహనాల పార్కింగ్, హెలిపాడ్ ఏర్పాట్లను పరిశీలించారు. సిల్వర్ జూబ్లీ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బి క్యాంప్, నంద్యాల చెక్ పోస్ట్ ప్రాంతాలను పరిశీలించారు.

Similar News

News October 2, 2025

ఈనెల 15 నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ: జేసీ

image

ఈనెల 15న రేషన్ షాప్ డీలర్ల వద్ద స్మార్ట్ రేషన్ కార్డులు పొందవచ్చని జేసీ డా.బి.నవ్య వెల్లడించారు. 16వ తేదీ నుంచి సచివాలయ ఉద్యోగులు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తారన్నారు. బుధవారం కర్నూలులోని బుధవార పేటలో ఎఫ్‌సీ షాపులను తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. స్మార్ట్ రేషన్ కార్డులు ఉచితంగా పంపిణీ చేయాలన్నారు. ఎవరైనా రేషన్ డీలర్లు డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News October 2, 2025

ప్రధాని పర్యటన నేపథ్యంలో పగడ్బందీగా ఏర్పాట్లు చేయండి: కలెక్టర్

image

ఈ నెల 16న ప్రధాని జిల్లాలో పర్యటించనున్నట్లు ప్రాథమికంగా సమాచారం అందిన నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ సిరి ఆదేశించారు. బుధవారం కర్నూలు కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్షించారు. పర్యటనకు సంబంధించి ఇంకా అధికారికంగా షెడ్యూల్ విడుదల కాలేదన్నారు. నగరంలో 4,000 మందితో రోడ్ షో ఉండే అవకాశం ఉందన్నారు.

News October 1, 2025

బన్నీ ఉత్సవాన్ని సంప్రదాయ సంబరంగా జరుపుకుందాం: ఎస్పీ

image

బన్నీ ఉత్సవాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం అన్ని పటిష్ఠ చర్యలు చేపట్టిందని ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్పష్టం చేశారు. బుధవారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బన్నీ ఉత్సవాన్ని సంప్రదాయ సంబరంగా జరుపుకోవాలన్నారు. ఇప్పటికే 200 మంది ట్రబుల్ మాంగర్స్‌పై బైండోవర్ కేసులు నమోదు చేసి, 340 రింగ్ కర్రలు స్వాధీనం చేసుకున్నామన్నారు. 800 మంది పోలీసులతో భద్రత కల్పించామన్నారు.