News October 2, 2025
ఎచెర్ల: డా. బీఆర్ అంబేడ్కర్ వర్సిటీలో స్పాట్ అడ్మిషన్స్

ఎచ్చెర్లలోని డా. బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో అక్టోబర్ 3, 4న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ బి. అడ్డయ్య బుధవారం తెలిపారు. అర్హత ఉన్న వారు ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు సంబంధించి నేరుగా ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరు కావాలని కోరారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆదేశాల మేరకు క్యాంపస్‌లో ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు వివరించారు.
Similar News
News October 3, 2025
శ్రీకాకుళం: గోడ కూలి భార్యాభర్త మృతి

భారీ వర్షాల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో విషాద ఘటన వెలుగు చూసింది. మందస మండలం హంసరాలి పంచాయతీ సవర టుబ్బూరులో సవర బుద్దయ్య (65), రూపమ్మ(60) దంపతులు రేకుల ఇంట్లో నివాసం ఉంటున్నారు. రాత్రి సమయంలో ఒక్కసారిగా గోడ కూలింది. నిద్రిస్తున్న దంపతులపై పడటంతో తీవ్రంగా గాయపడ్డారు. వారిని హరిపురం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇద్దరూ చనిపోయారు.
News October 3, 2025
శ్రీకాకుళం: నేడు ఆ స్కూళ్లకు సెలవు

వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో శుక్రవారం జిల్లాలోని 10 మండలాల పాఠశాలలకు డీఈవో రవికుమార్ సెలవు ప్రకటించారు. నరసన్నపేట, జలుమూరు, ఆమదాలవలస, పోలాకి, కొత్తూరు, శ్రీకాకుళం, హిరమండలం, గార, సరుబుజ్జిలి, ఎల్ఎన్ పేట మండలాల్లోని స్కూళ్లకు ఈ సెలవు వర్తిస్తుందని చెప్పారు. ఈ మేరకు ఎంఈవోలకు మెసేజ్ పంపారు.
News October 2, 2025
గాంధీ శ్రీకాకుళంలో అడుగు పెట్టింది అప్పుడే!

తెల్లదొరలను ఎదిరించే దిశగా ప్రజలకు స్ఫూర్తినిచ్చేందుకుగాను శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలోని దూసి రైల్వే స్టేషన్లలో మొట్టమొదటిసారిగా మహాత్మా గాంధీ అడుగుపెట్టారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా రైలులో ప్రయాణించి జిల్లాకు చేరుకున్నారు. ఈ రైల్వే స్టేషన్లో సుమారు 15 నిమిషాల పాటు తెల్లదొరలను ఉద్దేశిస్తూ ప్రసంగించారు. మహాత్మా గాంధీకి సంబంధించిన ఆనాటి గుర్తులు ఇప్పటికీ ఆ స్టేషన్లో ఉన్నాయి.