News April 6, 2024

దేశంలోనే మొదటి కళాశాల మన సంగారెడ్డిలో..

image

గిరిజన విద్యార్థులు న్యాయ విద్యలో రాణించేలా ప్రోత్సహించాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా ప్రత్యేకంగా న్యాయ విద్య అభ్యసించేలా మొట్టమొదటి గిరిజన లా కళాశాలను మూడేళ్ల కిందట సంగారెడ్డిలో ఏర్పాటు చేశారు. దేశంలోనే ఏర్పడిన మొదటి ఎస్టీ గురుకుల న్యాయ కళాశాల ఇది. ఇంటర్మీడియట్‌ అర్హతతో లాసెట్‌ రాసిన వారిలో ప్రతిభ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఐదేళ్లలో బీఏ ఎల్ఎల్బీ పూర్తి చేసేందుకు వీలుంటుంది.

Similar News

News January 19, 2026

మెదక్: పింఛన్ డబ్బుల కోసం తల్లిని చంపిన కొడుకు

image

మెదక్ మండలం రాజ్‌పల్లిలో దారుణం జరిగింది. మద్యం తాగేందుకు తన పింఛన్ డబ్బులు, బంగారం ఇవ్వలేదన్న కోపంతో చాకలి రాములు తన కన్నతల్లి నరసమ్మను కట్టెతో కొట్టి దారుణంగా హత్య చేశాడు. సమాచారం అందుకున్న రూరల్ ఎస్సై లింగం సంఘటనా స్థలానికి చేరుకుని, నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

News January 19, 2026

మెదక్: 267 పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణం

image

జిల్లాలోని 267 పాఠశాలల్లో ఉపాధి హామీ పథకం కింద 388 టాయిలెట్లు మంజూరైనట్లు డీఈఓ విజయ తెలిపారు. ఒక్కో యూనిట్‌కు రూ. 2 లక్షలు కేటాయించామన్నారు. బాలురు, బాలికలకు ప్రత్యేకంగా నిర్మించే ఈ పనులను సర్పంచులతో సమన్వయం చేసుకుని వెంటనే ప్రారంభించాలని హెచ్‌ఎంలు, ఎంఈఓలను ఆదేశించారు. పనుల్లో జాప్యం లేకుండా నాణ్యతతో పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

News January 19, 2026

‘మెదక్ జిల్లాను చార్మినార్ జోన్‌లో కలపాలి’

image

మెదక్ జిల్లాను చార్మినార్ జోన్‌లో కలపాలని జిల్లా వ్యాప్తంగా తహశీల్దార్‌కు వినతిపత్రాలు అందజేశారు. మెదక్ జిల్లాని రాజన్న సిరిసిల్ల జోన్‌లో గత ప్రభుత్వం అనాలోచితంగా కలిపిందని పలువురు ఆరోపించారు. నిరుద్యోగులు గ్రేడ్-4 స్థాయి ఉద్యోగాలకే పరిమితమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చార్మినార్ జోన్‌లో కలిపి ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలని కోరారు.