News October 2, 2025
భూసేకరణకు ఆటంకం కలిగిస్తే ఉపేక్షించొద్దు: సీఎం

AP: గూగుల్ డేటా సెంటర్ భూ సేకరణపై తప్పుడు కేసులు వేస్తున్న వారిపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ విశాఖ ఎయిర్‌పోర్టులో MLA గంటా శ్రీనివాసరావు, కలెక్టర్ హరేంధిర ప్రసాద్ డేటా సెంటర్ భూసేకరణ ప్రగతి, ఆ ప్రాంత రైతుల అభిప్రాయాలను సీఎంకు వివరించారు. రైతులకు తెలియకుండా వారి పేర్లతో కోర్టులో కేసు వేయడం, ఆ పేర్లలో మృతిచెందిన రైతు పేరు ఉండడం పట్ల కఠినంగా వ్యవహరించాలని CM ఆదేశించారు.
Similar News
News February 14, 2026
BHEL 47 పోస్టులకు నోటిఫికేషన్

ఝాన్సీలోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) 47 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. BE/BTech, డిప్లొమా, ఐటీఐ, ఇంటర్ అర్హతగల వారు మార్చి 15 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు ముందుగా అప్రెంటిస్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వయసు 18 నుంచి 27ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: https://jhs.bhel.com
News February 14, 2026
సుప్రీంకోర్టులో 19 ఏళ్ల కుర్రాడి సంచలన విజయం!

కేవలం 12వ తరగతి చదివిన 19 ఏళ్ల అథర్వ చతుర్వేది సుప్రీంకోర్టులో హిస్టరీ క్రియేట్ చేశారు. NEET క్వాలిఫై అయినా EWS కోటాలో సీటు రాకపోవడంతో తనే స్వయంగా SLP డ్రాఫ్ట్ చేసి సీనియర్ లాయర్లలా వాదించారు. 10 నిమిషాల్లో జడ్జిలను ఒప్పించగలిగారు. ప్రైవేట్ కాలేజీల్లోనూ EWS కోటాను నోటిఫై చేయాలని కోర్టు నేషనల్ మెడికల్ కౌన్సిల్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో అథర్వకు మెడికల్ సీటు కన్ఫామ్ అయ్యింది.
News February 14, 2026
ఇలాంటి పశుగ్రాసం పాడి పశువులకు అవసరం

పాడి పశువులకు అందిచే గ్రాసం రుచిగా, ఎక్కువ మాంసకృత్తులు కలిగి ఉండాలి. తక్కువ కాలంలో కోతకు వచ్చి ఎక్కువ దిగుబడి ఇచ్చేదిగా ఉండాలి. నీటి ఎద్దడిని తట్టుకొని ఏ దశలో కోసినా రుచికరంగా ఉండాలి. ఎలాంటి విష పదార్థాలు ఉండకూడదు. అన్ని కాలాల్లో మంచి దిగుబడిని ఇవ్వాలి. అన్ని రకాల నేలల్లో తక్కువ నీటితో సాగు చేసుకోగలినదై ఉండాలి. తెగుళ్లను తట్టుకునేలా, కోసిన తర్వాత రోజుల తరబడి నిల్వచేసుకొనుటకు వీలుగా ఉండాలి.


